టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 29వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వంచర్‌గా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీ రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్న ఈ సినిమాను, హాలీవుడ్‌కు ధీటుగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఎటువంటి ప్రచారం నిర్వహించకుండా, మీడియాకు సమాచారం ఇవ్వకుండా సైలెంట్‌గా షూటింగ్‌ను ప్రారంభించేశారు.
Also Read: Naga Chaitanya: గొప్ప మనసు చాటుకున్న నాగచైతన్య, శోభిత
అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఏంటీ అంటే.. ‘SSMB29’ మూవీపై రాజమౌళి త్వరలో ప్రెస్ మీట్ పెట్టి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించబోతున్నారని తెలుస్తోంది. ఎప్పుడైనా తన సినిమాలను ప్రారంభించక ముందే ప్రెస్ మీట్ పెట్టే జక్కన్న, ఇప్పుడు మాత్రం ఈ సినిమా ప్రారంభమైన తర్వాత, ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ ప్రెస్ మీట్ ఏప్రిల్ నెలలో ఉంటుందని టాలీవుడ్ టాక్. దీంతో ఇప్పుడు అందరి చూపు రాజమౌళి పెట్టబోయే ఈ ప్రెస్ మీట్‌పై పడ్డాయి. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.