ఈ ఏడాది జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ యొక్క నిర్వహణ హక్కులు మన బీసీసీఐకే ఉంది. కానీ మన భారత్ లో కరోనా కేసుల కారణంగా దీనిని బీసీసీఐ యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది. అయితే ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో డెసిషన్ రివ్యూ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది ఐసీసీ. దాంతో మొదటిసారి టీ20 ప్రపంచ కప్ లో ఈ డీఆర్ఎస్ ను ఉపయోగించినట్లు అవుతుంది. అయితే ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్ ప్రతి జట్టుకు చాలా ముఖ్యమైనదే అనే విషయం తెలిసిందే. ఇక ఈ పురుషుల టీ 20 ప్రపంచకప్ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనుంది. అయితే ఈ ప్రపంచ కప్ లో డీఎల్ఎస్ లో ఫలితాన్ని ప్రకటించాలంటే రేంజు జట్లు కనీసం 10 ఓవర్లయినా ఆడాల్సి ఉంటుందని తెలిపింది ఐసీసీ. ఒకవేళ అంతకంటే తక్కువ ఓవర్లతో ఈ డీఎల్ఎస్ పద్దతిని ఉపయోగించకూడదు అని పేర్కొంది.