Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీపై స్టార్ భారత ఆటగాడు అభిషేక్ శర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు అతను ఈ జట్టును వీడి వేరే ఫ్రాంచైజీకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ క్రీడా వర్గాల ద్వారా సమాచారం అందింది.
అమృత్‌సర్‌కు చెందిన 26 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అభిషేక్ శర్మ, 2019 సీజన్ నుంచి ఐపీఎల్లో సన్‌రైజర్స్ జట్టుతో కొనసాగుతున్నాడు. ఆరెంజ్ ఆర్మీ తరఫున నిలకడగా రాణిస్తూ గత ఐపీఎల్ 2026 సీజన్లో ఏకంగా 550కి పైగా పరుగులు సాధించి జట్టు ప్లేఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. జట్టులో తలెత్తిన కొన్ని పరిణామాలు అతనికి అసంతృప్తిని మిగిల్చాయి.
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
2026 ఐపీఎల్ సీజన్లో పాట్ కమిన్స్ జట్టులోకి ఆలస్యంగా రావడంతో ఇషాన్ కిషన్‌కు మేనేజ్మెంట్ లీడర్షిప్ బాధ్యతలు అప్పగించింది. భవిష్యత్తులోనూ కమిన్స్ అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా దూరంగా ఉండే అవకాశాలు ఉండటంతో, ఇషాన్ కిషన్‌ను పూర్తిస్థాయి కెప్టెన్‌గా కొనసాగించాలని ఎస్ఆర్హెచ్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చాలాకాలంగా ఫ్రాంచైజీలో కొనసాగుతున్న అభిషేక్ శర్మకు కూడా కెప్టెన్సీపై ఆశ ఉండటంతో, మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అతను మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ సన్‌రైజర్స్ జట్టును వీడి కొత్త ఆప్షన్లను అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్, అలాగే పంజాబ్ కింగ్స్‌తో పాటు యువరాజ్ సింగ్ మెంటర్‌గా ఉన్నఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు కూడా అతడితో అనధికారికంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఎస్ఆర్హెచ్ సీఈఓ కే.షణ్గగం మాత్రం ఈ వార్తలను ఖండించారు. అయితే, ఆటగాడి మనసులో ఉన్న అసంతృప్తి దృష్ట్యా వచ్చే వేలానికి ముందే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కెప్టెన్సీ ఆశలు లేకపోయినా, మెరుగైన భవిష్యత్తు కోసం అభిషేక్ శర్మ జట్టు మారాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!