Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 ఆసియా క్రీడల్లో పురుషుల బాక్సింగ్ విభాగంలో భారతదేశానికి మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని అంకుశ్ పంఘల్ సాధించి చరిత్ర సృష్టించాడు. హర్యానాకు చెందిన 21 ఏళ్ల యువ బాక్సర్ అంకుశ్ పంఘల్, పురుషుల 80 కేజీల ఫైనల్ పోరులో దక్షిణ కొరియాకు చెందిన మిన్సోంగ్ కిమ్‌తో తలపడి ఏకపక్ష విజయం సాధించాడు. ఈ తుది పోరులో అంకుశ్ 5-0 తేడాతో ఘన విజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
మొదటి రౌండ్లో 4-1 తేడాతో పైచేయి సాధించిన అతను, ఆ తర్వాత రెండు రౌండ్లలోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి 5-0 , 4-1 తేడాతో ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. ఈ ఆసియా క్రీడలకు ముందు అంకుశ్ తన అరంగేట్రం కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణ పతకం సాధించడం విశేషం. ఈ ఆసియా క్రీడలలో పురుషుల బాక్సింగ్ విభాగంలో అంకుశ్ స్వర్ణ పతకానికి ముందు భారత్ రెండు కాంస్య పతకాలను మాత్రమే సాధించగలిగింది.
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
కాగా.. ఇదే రోజు మహిళల బాక్సింగ్ విభాగంలోనూ భారత్‌కు అద్భుతమైన విజయాలు దక్కాయి. మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా , 65 కేజీల విభాగంలో పర్వీన్ హూడా స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ విజయాలతో లవ్లీనా , పర్వీన్ ఇద్దరూ మహిళల బాక్సింగ్‌లో ఆసియా క్రీడల స్వర్ణం సాధించిన దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ సరసన స్థానం సంపాదించుకున్నారు.
తన పుట్టినరోజు సందర్భంగా బరిలోకి దిగిన లవ్లీనా చైనాకు చెందిన జియి బావోపై 5-0 తేడాతో విజయం సాధించి, గత ఎడిషన్‌లో తను గెలుచుకున్న రజత పతకాన్ని స్వర్ణంగా అప్‌గ్రేడ్ చేసుకుంది. అలాగే పర్వీన్ హూడా పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన చెన్ నియెన్-చిన్‌పై 3-2 తేడాతో అరుదైన విజయం సాధించి తొలిసారిగా ఆసియా క్రీడల స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఈ విజయాల ద్వారా భారతదేశం బాక్సింగ్ రంగంలో తన సత్తాను మరోసారి అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పింది.
తాజావార్తలు
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!