త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్-16 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిట్స్ జట్టు కొత్త జెర్సీనీ విడుదల చేసింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ఆదివారం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఢిల్లీ క్యాపటిల్స్ పోస్ట్ చేసిన ఆ ఫోటో లో డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ తో పాటు పృథ్వీ షా కొత్త జెర్సీలను ధరించారు. కొత్త జెర్సీని చూసిన ఉత్సాహం.. కొత్త ఢిల్లీకి.. ఇదే కొత్త జెర్సీ అంటూ ఈ ముగ్గురిని ట్యాగ్ చేసింది. మార్చ్ 31న మొదలవ్వనున్న ప్రతిష్టాత్మక ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆడనున్నాయి. ఆ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది. మరో వైపు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ 1న జరుగనున్న రెండో మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధం కానుంది. ఈ మ్యాచ్ లో లఖ్నో సూపర్ జెయింట్స్ తో ఢిల్లీ జట్టు పోటీ పడనుంది.
Also Read : Surekha Vani: ఆంటీ.. నీ బొడ్డు అదిరింది.. అంకుల్స్ ఫిదా
ఇక ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఏప్రిల్ 4న ఢిల్లీ తమ మొదటి హోమ్ గేమ్ ను ఆడనుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో పోటీ పడనుంది. గత సీజన్ లో ఢిల్లీ క్యాపటిల్స్ మొత్తం 14 మ్యాచ్ లాడి ఏడింట్లో గెలిచి మరో ఏడింట్లో ఓడింది. 14 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ఢిల్లీ క్యాపిల్స్ జట్టు ప్లే ఆఫ్ స్పాట్ ను కోల్పోయింది.
Also Read : Cricket : మా బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయాం: రోహిత్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొత్తం 25 మంది ఆటగాళ్లు( ఓవర్సీస్ 8) కొనుగోలు చేసింది. అందులో ఇషాంత్ శర్మ(రూ.50లక్షలు), ఫిల్ సాల్ట్(రూ. 2 కోట్లు), ముఖేష్ కుమార్( రూ. 5.5 కోట్లు), మనీష్ పాండే(రూ.2.4 కోట్లు), రిలీ రోసోవ్, ( రూ.4.60 కోట్లు).. మిగతా ఆటగాళ్లు రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపాల్ పటేల్, రోవ్ మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్చ్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జ్, చేతన్ సకారియా, కమలేష్ నాగర్ కోటి, ఖలీల్ అహ్మద్, లుంగీ ఎంగిడి, ముస్తాపిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్ ఉన్నారు.