Surekha Vani: టాలీవుడ్ నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా నటిస్తూ మెప్పిస్తూ ఉంటుంది. ఇకసినిమాల్లోఎంతో పద్దతిగా కనిపించే ఆమె బయట అంతే హాట్ లుక్ లో దర్శనమిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కూతురు సుప్రీత తో కలిసి చిట్టిపొట్టి డ్రెస్ లు వేసుకొని అందాలను ఆరబోస్తూ ఉంటుంది. సురేఖ భర్త మృతి చెంది దాదాపు మూడేళ్లు కావొస్తోంది. భర్త చనిపోయాకా కూతురును హీరోయిన్ గా చేయడానికి అమ్మడు చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంతా కావు. ఇక నిత్యం సోషల్ మీడియాలో సురేఖ తన అందచందాలను చూపిస్తూ రీల్స్ చేస్తూ ఉంటుంది. ఎవరు ఎన్ని అనుకుంటే మనకెందుకు అని కామెంట్స్ పెట్టించుకోకుండా రీల్స్ చేస్తూ విమర్శలకు కూడా గురవుతూ ఉంటుంది. ఇక సురేఖకు అంకుల్స్ తో పాటు కుర్రాళ్ళు కూడా ఫ్యాన్స్ క్లబ్స్ నడిపించడం విశేషం.
తాజాగా సురేఖ ఒక వీడియో రీల్ ను పోస్ట్ చేసింది. గోవిందా గోవిందా సినిమాలోని అందమా అందుమా సాంగ్ లో ఒక లైన్ తీసుకొని అందుకు తగ్గట్టు స్టెప్పులు వేసి అదరగొట్టింది. వెయ్యి చెప్పినా.. లక్ష చెప్పినా లక్ష్య పెట్టదే ఇదేమి విల విల అంటూ పింక్ కలర్ చీరలో డ్యాన్స్ వేస్తూ మైమరిపించింది. ఆ పింక్ కలర్ సారీలో బొడ్డు చూపిస్తూ ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ముఖ్యంగా అంకుల్స్ అయితే.. సురేఖా.. నీ బొడ్డు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తుండడం విశేషం. ఇక కుర్రకారు సైతం ఆంటీ మీ స్టెప్స్, బొడ్డు బావున్నాయని చెప్పుకొస్తున్నారు. ఇక మరికొంతమంది.. పెళ్ళికి ఎదిగిన కూతురును ఇంట్లోపెట్టుకొని ఏంటీ చిల్లర వీడియోలు అంటూ విమర్శిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సురేఖావాణి పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది.