టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే ఓపెనర్స్ అద్భుతమైన బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. చెన్నై టీమ్ 10 ఓవర్లు ముగిసేసరికి కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 90 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ భారీ షాట్స్ తో పవర్ ప్లేలో సీఎస్కే స్కోర్ 50 పరుగుల మార్క్ ను దాటింది.
Also Read : Zelensky: రష్యా చేతిలో బందీ కావడం తీవ్ర అవమానకరం..
తొమ్మిదో ఓవర్ వేసేందుకు వచ్చిన రజా బౌలింగ్ లో తొలి రెండు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మూడో బంతికి ముందుకు వచ్చి ఆడేందుకు ప్రయత్నించడంతో బాల్ మిస్స్ కావడంతో కీపర్ జితేశ్ శర్మ చేతికి బంతి దొరకడంతో వికెట్లను గిరాటేశాడు. దీంతో గైక్వాడ్ 31 బంతుల్లో 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన శివమ్ దూబే మరోసారి తన బ్యాటింగ్ ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో 10 ఓవర్లకే చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్ 90/1గా ఉంది. డేవాన్ కాన్వే ( 45 ), శివమ్ దూబే ( 4 ) క్రీజులో ఉన్నారు.
Also Read : Mann ki Baat: ఏపీ రాజ్ భవన్ లో మన్ కీ బాత్ ప్రత్యేక ప్రదర్శన
మరో వైపు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లను అవుట్ చేసేందుకు పంజాబ్ కింగ్స్ బౌలర్ల శ్రమిస్తున్నారు. కట్టుదిట్టమైన బౌలింగ్ తో సీఎస్కే బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ డేవాన్ కాన్వే, శివమ్ దూబే వారి దూకుడైన బ్యాటింగ్ తో శిఖర్ ధావన్ సేనను దంచికొడుతున్నారు. ఉత్కంఠభరితంగా మ్యాచ్ కొనసాగుతుంది.