ఇవాళ రాజ్ భవన్ దర్బార్ హాల్లో ప్రధాని 100వ మన్ కీ బాత్ ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఆల్ ఇండియా రేడియో నేతృత్వంలో మన్ కీ బాత్ ప్రదర్శన నిర్వహించారు. మన్ కీ బాత్ ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్….ఈ సందర్భంగా ప్రముఖులు ఈ ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకం.మన్ కీ బాత్ ద్వారా ప్రధాని ప్రజల్లో చైతన్యం రగిలించారు.
Read Also: Viral Video : తల్లి పులి అడుగుజాడల్లో నడుస్తున్న పులి పిల్లలు
దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను ఎలా అధిగమించాలో ప్రధాని వివరిస్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రధాని నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమం చాలా మందికి వ్యాక్సినేషన్ విషయంలో అవగాహన కలిగించిందన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రసారం అయింది. దేశంతో పాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో కూడా లైవ్ టెలికాస్ట్ జరిగింది. మన్ కీ బాత్ వల్ల ప్రజల్లోని భావోద్వేగాలు తెలుసుకునే అవకాశం కలిగిందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
తన ఆలోచనలను మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో పంచుకోగలిగానని వెల్లడించారు. 100వ ఎపిసోడ్ కావడం వల్ల ఈ కార్యక్రమాన్ని దేశంలోని కోట్ల మంది వినేలా బీజేపీ భారీ ఏర్పాట్లను చేసింది. సామాన్యులకు సంబంధించి ప్రతీనెల కొన్ని వేల సందేశాలను ‘మన్ కీ బాత్’లో చదివానని ప్రధాని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమం తనను ప్రజలకు మరింతగా చేరువ చేసిందని అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 4 లక్షల ప్రాంతాల్లో ప్రజలు వినేలా బీజేపీ చర్యలు తీసుకుంది. పార్టీ జాతీయాధ్యక్షుడి నుంచి బూల్ లెవల్ కార్యకర్తలు వినేలా ఏర్పాట్లను చేసింది. బీజేపీ చీఫ్ జేపీనడ్డా స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్ని రాష్ట్రాల రాజ్ భవన్లు, బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల నివాసాల్లో వందో ఎపిసోడ్ ను వినిపించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న జేపీ నడ్డా, మహారాష్ట్రలో కేంద్రమంత్రి అమిత్ షా ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నారు.