మరికాసేపట్లో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ సమరం జరగనుంది. ఈ మ్యాచ్ కోసం చాలా రోజులుగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ పోరులో భారత్ గెలవాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా అభిమానులు ప్రత్యేకపూజలు చేస్తున్నారు. పంజాబ్‌లోని లుథియానాలో కొందరు అభిమానులు ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. అంతేకాకుండా భారత టీమ్ సభ్యుల ఫోటోలకు హారతులు కూడా పట్టారు. ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు పాకిస్థాన్ జట్టుపై భారత్ ఓడిపోలేదని.. ఈ మ్యాచ్‌లోనూ అదే రికార్డు కొనసాగించాలని…