Chennai Super Kings Scored 94 Runs In First 10 Overs Against KKR: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లపై చెన్నై సూపర్ కింగ్స్ దండయాత్ర చేస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు.. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 94 పరుగులు చేసింది. ఎప్పట్లాగే.. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే తమ జట్టుకి శుభారంభాన్ని అందించారు. మొదట్లో కాస్త నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించినా.. ఆ తర్వాత క్రమంగా చెలరేగిపోయారు. తొలి వికెట్‌కి వీళ్లు 73 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీళ్లిద్దరు క్రీజులో బాగా కుదురుకున్నారు కాబట్టి.. ఇద్దరూ భారీ ఇన్నింగ్స్ ఆడుతారని అంతా అనుకున్నారు. ముఖ్యంగా.. గైక్వాడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడుతుండటంతో, అతడు ఈరోజు ఊచకోత కోస్తాడని భావించారు. కానీ.. సుయాశ్ బౌలింగ్‌లో అతడు అనూహ్యంగా బౌల్డ్ అయ్యాడు. సుయాశ్ వేసిన గూగ్లీ బంతిని పసిగట్టలేకపోయాడు. దీంతో.. ఆ బంతి లోపలికి దూసుకెళ్లిపోయి, వికెట్లకు తాకింది.
RCB vs RR: పోరాడి ఓడిన రాజస్థాన్.. హోమ్‌గ్రౌండ్‌లో జెండా ఎగరేసిన ఆర్సీబీ

అతడు ఔట్ అయ్యాక రహానే క్రీజులోకి వచ్చాడు. మరోవైపు.. కాన్వే అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. 34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సుల సహాయంతో 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం వీళ్లిద్దరు క్రీజులో ఉన్నారు. ఎంతవరకు వీళ్లు తమ జట్టుకి స్కోరుని జోడిస్తారో చూడాలి. ఇక కేకేఆర్ బౌలర్ల విషయానికొస్తే.. సుయాశ్ శర్మ ఒక్కడే ఒక వికెట్ తీశాడు. వరుణ్, ఉమేశ్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ వేయగా.. ఇతర బౌలర్లు భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. ఒకవేళ చెన్నై ఇప్పుడున్న దూకుడునే కొనసాగిస్తే.. 200 పరుగుల మైలురాయిని అందుకునే అవకాశం ఉంటుంది. మరి.. ఆ మైల్‌స్టోన్‌ని చెన్నై అందుకుంటుందా? లేక ఆలోపే కేకేఆర్ బౌలర్లు కట్టడి చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ!