Royal Challengers Won By 7 Runs Against Rajasthan Royals: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఆదివారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. ఆర్సీబీ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ జట్టు ఛేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులే చేసింది. దీంతో.. 7 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయఢంకా మోగించింది. చివర్లో తమ జట్టుని గెలిపించుకోవడం కోసం ధృవ్ జురేల్, రవిచంద్రన్ అశ్విన్ గట్టిగానే పోరాడారు కానీ, ఫలితం లేకుండా పోయింది. అశ్విన్ వికెట్ పడ్డాక.. ఈ మ్యాచ్ ఆర్సీబీ వశం అయ్యింది.

Military Level Talks: తూర్పు లడఖ్ సరిహద్దు వివాదం.. చైనాతో మరోసారి భారత్ సైనిక చర్చలు
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (62), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (77) అద్భుతమైన అర్థశతకాలతో విజృంభించడంతో.. ఆర్సీబీ అంత భారీ స్కోరు చేయగలిగింది. మిగతా ఆర్సీబీ బ్యాటర్లెవ్వరూ పెద్దగా సత్తా చాటలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్డ్, సందీప్ శర్మ తలా రెండు వికెట్లు తీసుకోగా.. అశ్విన్, చాహల్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి, 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదట్లో జాస్ బట్లర్ డకౌట్ అయినా.. యశస్వీ, పడిక్కల్ (34 బంతుల్లో 52) అద్భుతంగా రాణించారు. వీళ్లిద్దరు కలిసి రెండో వికెట్‌కి 98 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. లక్ష్యాన్ని ఛేధించేందుకు మార్గాన్ని సుగుమం చేశారు.
Rahul Gandhi: ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రాహుల్ గాంధీ భారీ రోడ్ షో
అయితే.. వాళ్లు ఔటయ్యాక సంజూ(22), షిమ్రాన్(3) పెద్దగా రాణించలేకపోయారు. అక్కడికే రాజస్థాన్ కథ ముగిసిందని అనుకున్న తరుణంలో.. జురేల్ మళ్లీ ఆశలు చిగురించాడు. భారీ షాట్లు బాదుతూ.. జట్టుని విజయతీరాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అతనితో పాటు అశ్విన్ కూడా చిన్న కేమియోతో ఆశ్చర్యపరిచాడు. ఎక్కడో ఉన్న టార్గెట్‌ని.. దాదాపు ఛేజ్ చేసే స్టేజ్‌కి తీసుకెళ్లారు. చివరి ఓవర్‌లో 16 చేయాల్సి ఉన్నప్పుడు.. లక్ష్యాన్ని ఛేధించేస్తారేమోనని అనిపించింది. కానీ.. అశ్విన్ ఔటయ్యాక మ్యాచ్ ఆర్సీబీ వైపుకు మళ్లింది. చివరగా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. సిరాజ్, విల్లీ చెరో వికెట్ పడగొట్టారు.