Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
- ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం
- బెన్ స్టోక్స్‌కు భారీ షాక్
- ఇంగ్లండ్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ben Stokes Dropped From ENG vs NZ 2nd Test: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో పాటు పేసర్ గస్ అట్కిన్సన్ను న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో టెస్టుకు ఎంపిక చేయలేదు. ఇటీవల నైట్‌క్లబ్‌లో జరిగిన వివాదాస్పద ఘటనపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది. స్టోక్స్ స్థానంలో సీనియర్ బ్యాటర్ జో రూట్ తాత్కాలిక కెప్టెన్‌గా ఇంగ్లండ్ జట్టును నడిపించనున్నాడు.
జూన్ 17 నుంచి ది ఓవల్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్టుకు సంబంధించిన 15 మంది సభ్యుల జట్టును ఈసీబీ బుధవారం ప్రకటించింది. అయితే విచారణ కొనసాగుతున్న కారణంగా బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్.. ఓవల్ టెస్టుకు అందుబాటులో ఉండడం లేదని బోర్డు స్పష్టం చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టుకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది. న్యూజిలాండ్‌పై తొలి టెస్టులో 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన అనంతరం స్టోక్స్, అట్కిన్సన్ ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన ఘర్షణలో ఓ రగ్బీ ఆటగాడు కూడా పాల్గొన్నాడు. ఈ ఘటన జట్టు నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని భావించిన ఈసీబీ.. వెంటనే విచారణ ప్రారంభించింది.
Also Read
- FIFA World Cup 2026: భూగోళమంతా బంతిలోనే.. నేటి నుంచే ఫుట్‌బాల్ ప్రపంచకప్.. మనకు మాత్రం నిరాశే!
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
- నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
- BAN vs AUS: ఆసీస్‌కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే స్టోక్స్, అట్కిన్సన్‌లను రెండో టెస్టుకు ఎంపిక చేయకపోవడం ద్వారా బోర్డు కఠిన వైఖరిని ప్రదర్శించింది. విచారణ పూర్తయ్యే వరకు వీరిద్దరిపై మరిన్ని చర్యలు కూడా ఉండే అవకాశం ఉందని బ్రిటిష్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. స్టోక్స్ గైర్హాజరీలో ఇంగ్లండ్ జట్టుకు అనుభవజ్ఞుడైన జో రూట్ నాయకత్వం వహించనున్నాడు. గతంలో కూడా ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రూట్‌కు ఇది మరో అవకాశం కానుంది. కీలక సమయంలో అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని ఇంగ్లండ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టులోకి స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను తిరిగి ఎంపిక చేశారు. అలాగే ఎస్సెక్స్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్‌కు కూడా అవకాశం లభించింది. ఈ మార్పులతో న్యూజిలాండ్‌పై సిరీస్‌లో ఆధిక్యాన్ని కొనసాగించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఇదిలా ఉండగా.. బెన్ స్టోక్స్ భవిష్యత్తుపై కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్టోక్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉందని, అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే ఆలోచన కూడా చేస్తున్నట్లు బ్రిటిష్ మీడియా తమ కథనాలో పేర్కొన్నాయి. అయితే దీనిపై స్టోక్స్ లేదా ఈసీబీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
తాజావార్తలు
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
-
2026 Audi Q7: సూపర్ ఫాస్ట్ SUV.. 4.8 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకునే 2026 Audi Q7
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
Jayam Ravi Case : పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదు : ఆర్తి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!