కరోనా కారణంగా గత ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో భారత్ లో ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది అలాగే ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్లకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో బీసీసీఐ ఈ ఏడాది సీజన్ ను అర్ధాంతరంగా నిలిపివేసింది. అయితే లీగ్‌లో మిగిలిపోయిన 31 మ్యాచ్‌లను సెప్టెంబర్ – అక్టోబర్‌లో బీసీసీఐ పూర్తి చేయాలనుకున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఐపీఎల్ 2021 మళ్ళీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది. ఇక దీని పై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్ 2021 సాజన్ లో మిగిలిన మ్యాచ్ లో యూఏఈ వేదికగా సెప్టెంబర్ – అక్టోబర్ లో జరుగుతాయి అని తెలిపారు. ఇక విదేశీ ఆటగాళ్లు వచ్చిన రాకున్నా…. 25 రోజుల విండోలో లీగ్ పూర్తి చేయాలనీ బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది.