ఐపీఎల్ అభిమానులకు తీపికబురు అందింది. ఐపీఎల్ 2021 మ్యాచ్ లకు అభిమానులను అనుమతిస్తున్నట్లుగా కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన విడుదల అయింది. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2021 కు మధ్య లో బ్రేక్ పడిన సంగతి తెల్సిందే. అయతే.. ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లు ఈ నెల 19 నుంచి పునః ప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారి పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో… ఐపీఎల్ మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో…
కరోనా కారణంగా గత ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో భారత్ లో ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది అలాగే ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్లకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో బీసీసీఐ ఈ ఏడాది సీజన్ ను అర్ధాంతరంగా నిలిపివేసింది. అయితే లీగ్‌లో మిగిలిపోయిన 31 మ్యాచ్‌లను సెప్టెంబర్ – అక్టోబర్‌లో బీసీసీఐ పూర్తి చేయాలనుకున్నట్లు వార్తలు వచ్చాయి.…