ఇక వైసీపీ అరాచకాల్ని సహించం.. ఒక్కరిపై చేయి పడినా తీవ్ర పరిణామాలు..

ఇక వైసీపీ అరాచకాల్ని సహించం, ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా మరో టీడీపీ కార్యకర్తపై చేయి వేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని హెచ్చరించారు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండించిన ఆయన… ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. రాష్ట్రంలో జగన్, పల్నాడులో పిన్నెల్లి హత్యా రాజకీయాల్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించిన అచ్చెన్నాయుడు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పల్నాడులో అరాచకాలు, హత్య రాజకీయాలు ఎక్కువయ్యాయన్నారు.. రెండున్నరేళ్ల కాలంలో అనేక మంది టీడీపీ కార్యకర్తలను బలి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక వైసీపీ అరాచకాల్ని సహించం, ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా మరో టీడీపీ కార్యకర్తపై చెయ్యేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.. చంద్రయ్య కుటుంబానికి 60 లక్షల టీడీపీ కుటుంబ సభ్యులందరూ అండగా ఉంటారని ప్రకటించిన ఆయన.. చంద్రయ్యను హత్య చేసిన వారిని, హత్య చేయించిన వారిని ‎పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Read Also: బంగారు పతకం అందుకున్న మూషికం మృతి..

Related Articles

Latest Articles