ఆస్ట్రేలియా క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్ దిగ్గజ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో మరణించడంతో క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. 46 ఏళ్ల వయసులోనే సైమండ్స్ మరణించడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు సైమండ్స్‌కు రోడ్డుప్రమాదం జరిగిన ప్రదేశంలోనే అతని సోదరి లూయిస్ ఓ భావోద్వేగ లేఖను రాసి ఉంచడం అందరినీ కలిచి వేస్తోంది. Read Also: Thomas Cup : చరిత్ర సృష్టించిన భారత జట్టుకు కోటి రూపాయల బహుమతి ‘చాలా త్వరగా అందనంత దూరంగా…
ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను విషాదం నెలకొంది. ఆ జట్టు దిగ్గజం, మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46) రోడ్డుప్రమాదంలో మరణించాడు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో మృతి చెందగా.. ఇప్పుడు సైమండ్స్ రోడ్డుప్రమాదంలో మరణించడంతో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్భ్రాంతికి గురైంది. ఆసీస్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన సైమండ్స్ 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సైమండ్స్ 26 టెస్టులు ఆడి 1,462 పరుగులు…