Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports Argentina Won Fifa World Cup 2022 On France

Fifa World Cup 2022: ఫిఫా వరల్డ్‌కప్ విజేతగా అర్జెంటీనా.. నెరవేరిన మెస్సీ కల

Published Date :December 19, 2022 , 1:06 am
By NTV WebDesk
Fifa World Cup 2022: ఫిఫా వరల్డ్‌కప్ విజేతగా అర్జెంటీనా.. నెరవేరిన మెస్సీ కల
  • Follow Us :
  • google news
  • dailyhunt

Argentina Won Fifa World Cup 2022 On France: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం సాధించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌పై పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా గెలుపొందింది. ఈ విజయంతో అర్జెంటీనా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. గతంలో ఈ జట్టు 1978, 1986లో విజేతగా నిలిచింది. లియోనెల్ మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా తొలిసారి కప్పు నెగ్గింది. దీంతో.. తన కెప్టెన్సీలో అర్జెంటీనాకు కప్ తెచ్చిపెట్టాలన్న మెస్సీ కల నెరవేరింది. కాకపోతే.. ఈసారి మెస్సీ గోల్డెన్ బూట్‌ని కోల్పోయాడు. ఈ మ్యాచ్‌కి ముందు వరకు మెస్సీ, ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపే చెరో 5 గోల్స్‌తో సమంగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో మెస్సీ రెండు గోల్స్ చేయగా, ఎంబాపే హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. దీంతో ఎంబాపే గోల్డెన్ బూట్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు.

Vaishali Kidnap Case: కేసులో మరో పరిణామం.. ఏ2 నిందితుడు అరెస్ట్

మొదట్లో ఈ పోరులో అర్జెంటీనా ఆధిపత్యం సాధించింది. 23వ నిమిషంలో పెనాల్టీని మెస్సి గోల్‌గా మలచగా.. 36వ నిమిషంలో ఏంజెల్ డీ మారియా మరో గోల్ చేశాడు. దీంతో.. తొలి సగభాగం ముగిసేసరికి అర్జెంటీనా 2-0 పాయింట్లతో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ.. రెండో అర్ధభాగంలో మాత్రం ఫ్రాన్స్ పుంజుకుంది. ఆ జట్టు స్టార్‌ ఆటగాడు ఎంబాపే 80వ నిమిషంలో పెనాల్టీ కిక్ ద్వారా ఒక గోల్, ఆ వెంటనే 81 నిమిషంలో గోల్‌ చేసి.. స్కోరుని 2-2గా సమం చేశాడు. అప్పుడు ఇరు జట్లు మరో గోల్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి కానీ.. నిర్ణీత సమయం ముగిసింది. దీంతో అదనపు సమయం కేటాయించారు. మళ్లీ ఇరు జట్లు బరిలోకి దిగా.. 108 నిమిషాల వద్ద మెస్సీ గోల్ చేశాడు. దాంతో 3-2 తేడాతో అర్జెంటీనా మరోసారి ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే.. మ్యాచ్ ముగియడానికి మరో రెండు నిమిషాలు మాత్రమే ఉన్నప్పుడు, అంటే 118 నిమిషాల వద్ద ఎంబాపే ఊహించని షాకిచ్చాడు. పెనాల్టీని అతడు గోల్‌గా మలిచాడు. దీంతో మళ్లీ స్కోరు 3-3తో సమం అయ్యింది.

Rajma Seeds: రాజ్మా తినండి.. ఆరోగ్యంగా ఉండండి

అదనపు సమయం అయిపోవడం, ఇరు జట్ల స్కోరు సమయంగా ఉండటంతో.. పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ రౌండ్‌లో అర్జెంటీనా వరుసగా నాలుగు బంతుల్ని గోల్స్‌గా మలచగా.. ఫ్రాన్స్ కేవలం రెండు బంతుల్ని గోల్స్‌గా మారింది. దీంతో.. ఈ మ్యాచ్ అర్జెంటీనా వశమైంది. ఎప్పట్నుంచో కంటున్న కల ఈ మ్యాచ్‌తో నెరవేరడంతో.. ప్రపంచవ్యాప్తంగా లియోనెల్ మెస్సీ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొందరైతే సంబరాలు కూడా జరుపుకుంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Argentina Fifa World Cup 2022
  • argentina vs france
  • fifa world cup 2022
  • Lionel Messi
  • Qatar fifa World Cup

తాజావార్తలు

  • Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

  • SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతు.. ఏకంగా రూ.కోటి 20 లక్షలు

  • NTRNeel : విలన్‌గా బాలీవుడ్ స్టార్.. కానీ లుక్ మాత్రం..?

  • Trump: చర్చలు ఫెయిల్.. ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. వెనిజులా వ్యూహాన్ని ఇరాన్‌పై అమలుకు రెడీ!

  • US-Iran Talks: “టైమ్‌ పాస్ చేస్తోంది”.. అమెరికాపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions