Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు ప్రధాన పేస్ బౌలర్ జస్పీత్ బుమ్రాకు సంబంధించి టీమ్ మేనేజ్మెంట్ ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఫార్మాట్ లేదా కెప్టెన్ ఎవరైనాసరే, బుమ్రా తమ జట్టులో ఉండాలని కోరుకుంటారు. అయితే, మేనేజ్మెంట్ మాత్రం ఆయనను కేవలం టెస్ట్ క్రికెట్ (రెడ్ బాల్) పై మాత్రమే దృష్టి పెట్టాలని సూచించింది. రాబోయే కొన్ని నెలల పాటు ఆయన పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉండి, పూర్తిగా టెస్ట్ ఫార్మాట్‌పైనే ఫోకస్ చేయనున్నారు.
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదిక ప్రకారం.. న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు బుమ్రాను ‘ఇండియా ఎ’ తరఫున మ్యాచ్ ఆడేలా చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. బోర్డు ఇప్పటికే కొన్ని ‘ఇండియా ఎ’ మ్యాచ్‌లకు జట్టును ప్రకటించగా, మూడో మ్యాచ్‌కు ఎంపిక చేసే జట్టులో బుమ్రా ఆడే అవకాశం ఉంది. ఆయన ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నప్పటికీ, పూర్తి స్థాయి మ్యాచ్ ఫిట్నెస్ను పరీక్షించుకోవడానికి ప్రొఫెషనల్ మ్యాచ్‌లు ఆడటం అవసరమని భావిస్తున్నారు. నవంబర్‌లో జరిగే వన్డే సిరీస్‌కు ఆయనను దూరంగా ఉంచి, కేవలం టెస్ట్ సిరీస్‌లకే పరిమితం చేయాలని బోర్డు యోచిస్తోంది.
Also Read
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
అలాగే, న్యూజిలాండ్ టూర్‌కు వెళ్లే ముందు సాధారణ ఫిట్నెస్ పరీక్షల కోసం బుమ్రా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)కు వెళ్లనున్నారు. డిసెంబర్లో శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్, జనవరిలో జింబాబ్వేతో జరిగే వన్డే సిరీస్ నుంచి కూడా ఆయనకు విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయి. దీనికి ప్రధాన కారణం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని, అలాగే స్వదేశంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్‌ను గెలవాలని టీమ్ ఇండియా పట్టుదలగా ఉంది. ఈ కారణంగానే ఆయనను వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కింద పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పిస్తున్నారు.
టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే 2027 ఫిబ్రవరి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఐపీఎల్లో ఏ ఆటగాడూ విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి, ఆ తర్వాత 2027 అక్టోబర్-నవంబర్‌లో జరిగే వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని అప్పుడు వన్డేలపై దృష్టి సారిస్తారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
- Tags
- bcci
- bumrah
- teamindia
- TestCricket
తాజావార్తలు
-
Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
-
Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!