A2 Accused Ruman Arrested By Police In Vaishali Kidnap Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన డా. వైశాలి కిడ్నాప్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న మహ్మద్ వాజిద్ రుమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వోల్లో కారులో వైశాలిని కిడ్నాప్ చేసి, శంషాబాద్ వద్ద డ్రాప్ చేసిన ఈ రుమాన్‌ను ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి వోల్వో కార్ కీస్, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వైశాలిని కిడ్నాప్ చేసిన తర్వాత.. వోల్వో కారుని శంషాబాద్ వద్ద వదిలింది రుమాన్ అని పోలీసులు తేల్చారు. అతనితో పాటు పవన్, రామచంద్రచార్యలను సైతం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 42కి చేరింది.
కాగా.. తాను ప్రేమించిన వైశాలికి ఎన్ఆర్ఐ సంబంధం వచ్చిందని తెలిసి, నవీన్ రెడ్డి ఆమెను తన స్నేహితుల సహకారంతో కిడ్నాప్ చేశాడు. తొలుత తన అనుచరుల్ని వైశాలి ఇంటికి తీసుకొచ్చి దాడికి పాల్పడ్డాడు. అనంతరం.. ఆమెను బలవంతంగా అపహరించాడు. వైశాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్ రెడ్డి.. తన మిత్రుల సహకారంతో వైశాలిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించాడు. కిడ్నాప్ చేసినప్పుడు తనని నవీన్‌తోపాటు అతని స్నేహితులు తన పట్ల దారుణంగా వ్యవహరించారని.. వాళ్లను కఠినంగా శిక్షించాలని వైశాలి డిమాండ్ చేసింది. ఆమె ఇచ్చిన వాంగ్మూలం మేరకు పోలీసులు కేసుని విచారిస్తున్నారు. నిందితుల్ని ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటున్నారు.