Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VVS Laxman Prefers Vaibhav Sooryavanshi: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి నిరాశే ఎదురైంది. వెస్టిండీస్‌తో హైదరాబాద్‌లో జరిగిన నాలుగో టీ20లోనూ అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. దాంతో వైభవ్‌కు తుది జట్టులో అవకాశం రాకపోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్లో ఇప్పటివరకు బుడ్డోడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌కు ముందు జట్టులో మార్పులు చేయాలా వద్దా అనే చర్చతో పాటు వైభవ్‌కు ఎప్పుడు అవకాశం దక్కుతుందనే ప్రశ్నలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్ల పర్యవేక్షణలో లభించిన అవకాశాలను నెటిజెన్లు చర్చిస్తున్నారు. ఇందుకు సంబందించి గణాంకాలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) అధిపతిగా ఉన్న లక్ష్మణ్.. టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో వైభవ్‌కు ఎక్కువగా ఆడే అవకాశం దక్కింది. రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హయాంలో మాత్రం అతడు తక్కువ మ్యాచ్‌ల్లోనే మైదానంలోకి దిగాడు.
Also Read
- IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
- Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
- Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
భారత్ తరఫున ఇప్పటివరకు ఎనిమిది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ.. ఐదు మ్యాచ్‌ల్లో వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో బరిలోకి దిగాడు. గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో 14 మ్యాచ్‌లలో కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడే అవకాశం దక్కింది. ఈ గణాంకాలే ప్రస్తుతం అభిమానుల మధ్య చర్చకు కారణమయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో జింబాబ్వే పర్యటనలోని టీ20 సిరీస్‌తో పాటు 2026 ఆసియా క్రీడల్లోనూ గంభీర్ స్థానంలో లక్ష్మణ్ భారత జట్టు బాధ్యతలు నిర్వహించాడు. జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ వైభవ్ ఆడాడు. ఆసియా క్రీడల్లోనూ భారత్ తరఫున సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. మెరుగైన ర్యాంకింగ్ ఆధారంగా భారత్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. ఆ మ్యాచ్‌లో వైభవ్ ఆడలేదు.
కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేస్తున్న వైభవ్ సూర్యవంశీ గణాంకాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఎనిమిది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 246 పరుగులు చేసిన అతడు.. 186 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఇంతటి దూకుడైన ఆటతీరు ఉన్న యువ ఆటగాడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఇటీవల మాజీ భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించాడు. ప్రతిభ ఉన్న ఆటగాడికి వయసు అడ్డంకి కాకూడదని అభిప్రాయపడ్డాడు. అండర్-19 వంటి వయోపరిమితి టోర్నీల్లో వయసు నిబంధనలు ముఖ్యమని, అయితే ఐపీఎల్ లేదా భారత జట్టు తరఫున ఆడే స్థాయికి చేరుకున్న తర్వాత ఆటగాడి ప్రదర్శనే కీలకమని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!