Aiden Markram Reveals Reason Behind SRH Loss Against MI: ఐపీఎల్-2023లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 19.5 ఓవర్లో 178 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో గెలుస్తుందనే ఆశలు చిగురించింది కానీ, వరుసగా వికెట్లు పడటంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అంచనాలు పెట్టుకున్న స్టార్ బ్యాటర్లలో ఏ ఒక్కరూ సత్తా చాటకపోవడం వల్లే.. ఎస్ఆర్‌హెచ్ ఓడిపోయిందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్ర్కమ్ కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తాము ఈ మ్యాచ్‌లో ఓటమి పాలయ్యామని తెలిపాడు.
Superman Legacy: వరల్డ్ బిగ్గెస్ట్ సూపర్ హీరో సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది

మార్క్రమ్ మాట్లాడుతూ.. ‘‘మేము బ్యాటింగ్‌లో సమిష్టగా రాణించలేకపోయాం. మా ఓటమిని అదే శాసించింది. అయితే.. చివరివరకు పోరాడటంలో మా ఆటగాళ్లు వెనకాడలేదు. లక్ష్యానికి చాలా దగ్గరగా మ్యాచ్‌ని తీసుకెళ్లారు. ఇందుకు మా బాయ్స్‌కు క్రెడిట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. బౌలింగ్ సమయంలో.. ఆఖరిలో కొన్ని అదనంగా పరుగులు సమర్పించుకున్నాం. అక్కడ కొంచెం కవర్ చేసి ఉంటే బాగుండేది. పిచ్ మ్యాచ్ మొత్తం ఒకేలా ఉంది. వికెట్ నెమ్మదిగా ఉండటంతో పాటు బ్యాటింగ్‌కు అనుకూలంగా పిచ్ ఉంది. మేము మా ఆటలో వేగం పెంచినప్పుడు.. దురదృష్టవశాత్తూ బంతి బ్యాట్‌పైకి రాలేదు. బౌలర్లను ఎదుర్కోవడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. నిజానికి.. మంచు ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతోనే మేము ఫీల్డింగ్ ఎంచుకున్నా. కానీ.. మేము అనుకున్నది జరగలేదు. ఒక వేళ డ్యూ ప్రభావం ఉండి ఉంటే.. కచ్చితంగా మేము విజయం సాధించేవాళ్లం’’ అంటూ చెప్పుకొచ్చాడు.
Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్.. నాలుగో ఆటగాడిగా రికార్డ్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కెమెరాన్ గ్రీన్ (64) అర్థశతకంతో రాణించడం.. తిలక్ వర్మ (37) మెరుపు ఇన్నింగ్స్.. అంతకుముందు రోహిత్ శర్మ(28), ఇషాన్ కిషన్ (38) కూడా శుభారంభం ఇవ్వడంతో.. ముంబై అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు.. 19.5 ఓవర్లలో 178 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ మొదట్లో నిదానంగానే సాగినా.. ఆ తర్వాత క్లాసెన్, మయాంక్ అగర్వాల్ ఊపందుకోవడంతో.. ఆశలు చిగురించాయి. కానీ.. చివర్లో వరుసగా వికెట్లు పడటంతో సన్‌రైజర్స్ ఓటమి పాలైంది.