Off The record: ఎప్పుడెప్పుడా అని ఇన్నాళ్ళు ఉన్న టెన్షన్… ఇప్పుడు అటెన్షన్‌లోకి వచ్చేసింది. తెలంగాణలో పొలిటికల్ పొగలు సెగలుగక్కే టైం దగ్గర పడుతోంది. నువ్వా..నేనా.. అనే లెవెల్ డిస్కషన్‌కి టైం ఫిక్స్ అయిపోయింది. డేట్ అండ్ టైం ఓకే అయిపోయాయి. ఇక ఆయుధాలతో బరిలో దిగడమే మిగిలిఉంది? ఇంతకీ ఏంటా పొలిటికల్ వార్? అంత హైప్ రావడానికి కారణాలేంటి?
Read Also: Jammu&Kashmir : జమ్ములో విరిగిపడ్డ కొండ చరియలు…ఐదుగురు మృతి పలువురికి గాయాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభ తేదీ ఖరారైంది. ఈ నెల 30 నుంచి.. అసెంబ్లీ తాజా సెషన్ మొదలవబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు.. కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద కూడా ఈసారి చర్చించబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఈపాటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. దాని మీద కేబినెట్‌లో డిస్కషన్ జరిగింది. అసెంబ్లీలో చర్చకు పెట్టాలని ఆ సందర్భంగానే డిసైడ్ అయ్యారు ప్రభుత్వ పెద్దలు. రాష్ట్రంలో ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ పరిస్థితు్లలో… అసెంబ్లీ సమావేశాలు పెడతారా..? లేదా..? అనే మీమాంస ఉండేది. కానీ… 29న కేబినెట్ మీటింగ్, 30నుంచి అసెంబ్లీని సమావేశ పరచాలని డిసైడ్ అయ్యింది రేవంత్ సర్కార్. కాళేశ్వరం కమిషన్..మొత్తం 665 పేజీల నివేదిక ఇచ్చింది. దాన్నే సభలో ప్రవేశ పెట్టాలనుకుంటోందట ప్రభుత్వం.
Read Also: Crime Love: ప్రేమించుకున్న ఇద్దరు అబ్బాయిలు.. భార్యాభర్తల్లా కలిసిందామనుకొని చివరకు?
కాళేశ్వరం కమిషన్ నివేదిక పూర్తి డాక్యుమెంట్‌ను సభ్యులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. సభలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ప్రతులు ఇచ్చి… అందరి అభిప్రాయాలు సేకరించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో అధికార పార్టీతో పాటు మిత్రపక్షం సీపీఐ, విపక్షాలు బీఆర్‌ఎస్, బీజేపీ, mim ఉన్నాయి. ఈ క్రమంలోనే… కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక పై తదుపరి చర్యల కోసం అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించుకున్నారట సీఎం రేవంత్‌రెడ్డి. అన్ని పార్టీల అభిప్రాయాలకు అనుగుణంగా విచారణకు ఆదేశించాలని భావిస్తోందట ప్రభుత్వం. కాంగ్రెస్, సీపీఐ, mim పార్టీలు కమిషన్ నివేదిక ప్రకారం పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ మాత్రం.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తోంది. అటు బీఆర్ఎస్ మాత్రం…ఇప్పటికే కమిషన్ నివేదికపై హైకోర్టు మెట్లెక్కింది.
Read Also: Off The record: జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నారా..?
రిపోర్ట్ పేరుతో ఈ ప్రభుత్వం కేసీఆర్ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు గులాబీ నాయకులు. అసలా నివేదికను రద్దు చేయాలంటూ కోర్టుకు వెళ్ళారు. కానీ… కోర్ట్‌లో BRS కి చుక్కెదురైంది. నివేదికపై సభలో చర్చిస్తామని ప్రభుత్వం కోర్ట్‌కు చెప్పినట్టుగానే.. 30 నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతుందని అంటున్నారు. అటు బీఆర్‌ఎస్ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే నివేదికపై సీరియస్ గానే చర్చించాలనుకుంటున్నట్టు సమాచారం. అదే స్థాయిలో సీఎం రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా ప్రిపేర్ అవుతున్నారట. ఐతే.. బీఆర్‌ఎస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వస్తారా..? లేదంటే యధావిధిగా…హరీష్‌రావు, కేటీఆర్‌తోనే బండి లాగించేస్తారా అన్న విషయంలో మాత్రం ఆ పార్టీ వైపు నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు కేసీఆర్ సభకు పూర్తిస్థాయిలో వచ్చింది లేదు. దీంతో కాళేశ్వరంపై చర్చకు అయినా వస్తారా..? లేదా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చించాక రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇక్కడి స్థాయిలోనే విచారిస్తారా? లేక కేంద్ర దర్యాప్తు సంస్థల దాకా వెళ్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.