తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఇవాళ వాడివేడిగా సాగనున్నది. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. సభ లోపల.. బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం ప్రభుత్వ బిల్లులపై చర్చ కొనసాగనున్నది. మొదట పంచాయతీ రాజ్.. మున్సిపల్ సవరణ బిల్లులు.. తర్వాత కాళేశ్వరం కమిషన్ నివేదిక పై చర్చ జరుగనుంది. “కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం – జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమీషన్ నివేదిక”…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “విద్యార్థి దశ నుంచే గోపినాథ్ చురుకుగా ఉండేవారు.. 1983లో తెలుగుదేశం పార్టీలో గోపీనాథ్ తన రాజకీయ ప్రస్థానాన్ని గోపీనాథ్ ప్రారంభించారు..1985 నుంచి 1992 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేశారు.. 1987-88 లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్‌గా, 1988-93 లో…