Telangana Assembly News: శాసనసభలో కాళేశ్వరం కమిషన్‌పై చర్చ మొదలైంది. సభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడిన దానిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసంపూర్తి సమాచారంతో హరీష్ రావు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆనాడు మంత్రిగా ఉన్న హరీష్ రావు ఈనాటికీ మంత్రిగా ఉన్నట్లుగానే భావిస్తున్నారని అన్నారు. నీరు అందుబాటులో ఉందని చెప్పినా మళ్లీ పరిశీలించాలని లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని వారిని…
High Court refuses to issue interim orders for KCR: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. పూర్తిస్థాయి కౌంటర్‌ను దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చించిన తరువాతే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం కేసీఆర్, హరీష్‌రావు…
కాళేశ్వరం రిపోర్ట్‌తో మాజీ మంత్రి హరీశ్‌రావు... ఏం చేయబోతున్నారు ? సీఎస్ రామకృష్ణారావు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక హరీశ్‌రావుకు ఇస్తారా? అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుంటే... అంతకు ముందే కమిషన్ నివేదికపై మాజీ మంత్రి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా ? కాళేశ్వరంపై తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది ?
కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్... 665 పేజీల నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ముగ్గురు అధికారుల కమిటీ దాన్ని పూర్తిగా స్టడీ చేసి 60 పేజీల సారాంశాన్ని క్యాబినెట్‌కు అందించింది. అయితే ఈ అరవై పేజీల నివేదికలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల పేర్లు మాత్రమే ప్రస్తావించి వారు సక్రమంగా విధులు నిర్వర్తించ లేదని స్పష్టం చేసింది.
Kaleshwaram Commission Report: ఒకట్రెండు రోజుల్లో కాళేశ్వరం కమీషన్ నివేదికను పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వంకు ఇవ్వనుంది. ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ నివేదికను సీల్డ్ కవర్‌లో ఉంచారు. దాదాపు 500 పేజీలతో తుది నివేదికను కమిషన్ ఇవ్వనుంది. 3 వేల పేజీలతో మొత్తం డాక్యుమెంట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు ఒకటి లేదా రెండో తేదీన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నివేదికను స్వీకరించి.. ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల…