Off The Record: తెలంగాణలో మరోసారి పదవుల జాతర జరగబోతోందా? అందుకు సంబంధించి ఇప్పటికే ప్రాధమిక కసరత్తు పూర్తయిందా? ఈనెలలోనే పందేరం ఉండబోతోందా? ఆ విషయంలో పార్టీ, ప్రభుత్వ పెద్దలు అవగాహనకు వచ్చారా? మంత్రి పదవులు ఆశించి భంగపడ్డవారిని ఈసారి సంతృప్తి పరిచే అవకాశం ఉందా? ఇంతకీ ఏ పదవుల్ని భర్తీ చేయబోతున్నారు? ఏమా కథ?
Read Also: Off The Record: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఏం చేయబోతున్నారు..?
మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వ విప్‌గా పనిచేసిన అడ్లూరి లక్ష్మణ్ కేబినెట్ మంత్రి అయ్యారు. రాంచంద్రు నాయక్‌ని డిప్యూటీ స్పీకర్‌ని చేస్తామని ప్రకటించేశారు పార్టీ పెద్దలు. ఈ క్రమంలో… ప్రభుత్వ విప్‌ల నియామకంపై ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. విప్ పదవుల భర్తీకి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టిన క్రమంలో.. పార్టీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో ప్రాధమిక కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా… క్యాబినెట్ విస్తరణలో చోటు దక్కని వారిని విప్ పదవులకు పరిగణనలోకి తీసుకోవాలని అనుకుంటున్నట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లాకు క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లేదు. ఈ జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు.
Read Also: Off The Record: వార్ లో జూనియర్ కొండా!
కానీ, ఎవరికీ ఛాన్స్ రాలేదు. వీళ్ళిద్దరిలో ఒకరికి చీఫ్ విప్ పదవి ఇచ్చే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ వర్గాల్లో. అయితే…. ఇద్దరూ క్యాబినెట్‌లో చోటు కోసం తీవ్రంగానే ప్రయత్నించడం,ఒకే సామాజిక వర్గం కావడంతో బ్యాలెన్స్ చేయడంలో ఇబ్బంది రావచ్చన్న భయాలు కూడా ఉన్నాయట. అటు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కూడా బీసీ కోటాలో క్యాబినెట్‌లో అవకాశం కల్పించాలని దరఖాస్తు పెట్టుకున్నా… వర్కౌట్ కాలేదు. దీంతో ఇప్పుడాయన ప్రభుత్వ విప్ పదవి ఆశిస్తున్నారు. ఆయన పేరుని కూడా పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ప్రభుత్వ విప్ ఇస్తే బాగుంటుందని ఆలోచన పార్టీ పెద్దలకు ఉన్నట్టు సమాచారం. అయితే… ప్రస్తుతం ఇన్నీ ప్రతిపాదనల స్థాయిలోనే ఉన్నాయట. అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడితే.. వీటన్నిటి విషయంలో పూర్తి క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా భర్తీ చేసే అవకాశం లేకపోలేదన్నది ఇంకో వెర్షన్. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఈ అసెంబ్లీ సెషన్ లోనే జరగబోతోంది.