మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వ విప్‌గా పనిచేసిన అడ్లూరి లక్ష్మణ్ కేబినెట్ మంత్రి అయ్యారు. రాంచంద్రు నాయక్‌ని డిప్యూటీ స్పీకర్‌ని చేస్తామని ప్రకటించేశారు పార్టీ పెద్దలు. ఈ క్రమంలో... ప్రభుత్వ విప్‌ల నియామకంపై ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. విప్ పదవుల భర్తీకి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టిన క్రమంలో.. పార్టీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది.