బెజవాడలో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆ సామాజిక వర్గం నుంచి వైసీపీకి డిమాండ్ వస్తుందట. గతంలో తమ సామాజిక వర్గానికి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవటంతో లోలోన మథనపడుతుందట. వచ్చే ఎన్నికల నాటికి కచ్చితంగా నగరంలో ఓ టికెట్ కేటాయించాలని అధిష్టానం దృష్టికి పార్టీ నేతలు తీసుకువెళ్తున్నారట. ఈ అంశంపై పార్టీ అధిష్టానం కూడా ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ఇంతకీ ఏ సామాజిక వర్గం నుంచి వైసీపీకి ఈ విజ్జప్తులు వెళ్తున్నాయి. ఏంటా చర్చా…లెట్స్ వాచ్
ఏపీ రాజకీయ రాజధానిగా ఉన్న బెజవాడలో వైసీపీకి కాపు సామాజిక వర్గం నుంచి ప్రాతినిద్యం వహించే ప్రజాప్రతినిధులు లేరు.దీంతో ఆ ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతోంది ఆ సామాజిక వర్గం. విజయవాడ నగరంలో పశ్చిమ, తూర్పు, సెంట్రల్ మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడు నియెజకవర్గాల్లో తూర్పులో 65 వేలు, సెంట్రల్ లో 75 వేలు జనాభా కాపు సామాజిక వర్గం నుంచి ఉంది.ఈ విషయాన్ని వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గం… అధిష్టానం దృష్టికి తీసుకు వస్తోందట. గతంలో కాంగ్రెస్ , ప్రస్తుతం టీడీపీ, జనసేనలు కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్నీ గుర్తు చేస్తున్నారట. తమకు మాత్రం వైసీపీలో గత రెండు ఎన్నికల్లోనూ విజయవాడ నగరంలో టికెట్ దక్కలేదని లోలోపల మధన పడుతున్నారట. 2014లో ఒక టికెట్ ను వైసీపీ అధిష్టానం కాపులకు కేటాయించిందని… ఆ తర్వాత రెండు ఎన్నికల్లో…తమ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించలేదని, దీని వల్ల తమకు ప్రాతినిధ్యం వహించే లీడర్ లేక ఇబ్బందులు పడుతున్నామని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు.
బెజవాడ నగరంలో కాపులకు పార్టీలు ఇచ్చిన గుర్తింపుతోపాటు ప్రస్తుతం కాపు సామాజిక వర్గం అసంతృప్తిని తగ్గించాల్సిన అవసరం గురించి కూడా వైసీపీ అధిష్టానం దృష్టికి పదే పదే ఆ పార్టీ నేతలు తీసుకెళ్తున్నారట. బెజవాడ నగరం నుంచి వైసీపీ 2014లో వంగవీటి రాధాకృష్ణకు విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి టికెట్ ఇవ్వగా ఆయన ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల ముందే జగన్ వంగవీటి రాధాకు రాష్ట్ర వైసీపీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా బాద్యతలు ఇచ్చి కాపులకు తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని చెప్పారని పార్టీ నేతలు చెబుతున్నారట. 2014 తర్వాత అంటే 2019, 2024 రెండు ఎన్నికల్లో విజయవాడ నగరంలో కాపులకు సీటును వైసీపీ కేటాయించలేదు. ఎన్టీఆర్ జిల్లాను పరిశీలిస్తే జగ్గయ్యపేట నుంచి సామినేని ఉదయభానుకు కాపు సామాజిక వర్గం నుంచి టికెట్ ను వైసీపీ అధిష్టానం కేటాయించింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉదయబాను జనసేనలో చేరటంతో ఆ నియోజకవర్గ ఇన్చార్జిని కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వటంతో…అసలు ఇన్చార్జి కూడా ఎన్టీఆర్ జిల్లాలో లేకుండా పోయారని లెక్కలు చెబుతున్నారట వైసీపీ కాపు సామాజిక వర్గ నేతలు.
గత ఎన్నికల్లో బెజవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని కాపు సామాజిక వర్గానికి కేటాయిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేసిన అడపా శేషు, బొమ్మదేవర సుబ్బారావు, ఆకుల శ్రీని వాస్ వంటి వారు పూర్తి స్థాయిలో కాపు సామాజిక వర్గం నుంచి పోటీ చేయటానికి అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ను తీసుకువచ్చి సెంట్రల్ లో పోటీకి నిలిపారు. ఒకే సమయంలో బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలను పక్కన పెట్టి కాపులకు సీటును కేటాయిస్తే రెండు సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని అధిష్టానం గత ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదని స్థానిక నేతలు చెబుతున్న మాట. మరోవైపు టీడీపీ బెజవాడ నగరంలో ఒక ఎమ్మెల్యే సీటు, జనసేన కృష్ణాజిల్లాలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించటం ద్వారా కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకుంటోందని నేతలు ఈక్వేషన్స్ చెబుతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో బెజవాడ నగరం నుంచి తమకు కాపు కాసే.. ఓ నాయకుడికి ప్రాతినిద్యం కల్పించాలని కోరుతున్నారట. మరి అధిష్టానం ఈ ఈక్వేషన్స్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి.