Kothwalguda Eco Park: కొత్వాల్ గూడ ఎకో పార్కుని ప్రభుత్వ ప్రధాన సలహాదారు రామకృష్ణారావు, MAUD సెక్రెటరీ ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా 85 ఎకరాల విస్తీర్ణంలో 75 కోట్ల రూపాయల వ్యయంతో హెచ్ఎండీఏ కొత్వాల్ గూడ ఎకో పార్కును నిర్మించింది. ఎకో పార్కులోని అరైవల్ ప్లాజా పనులు పూర్తి చేసి.. మరో రెండు నెలల్లో ఈ పార్కును పబ్లిక్ కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎస్ కు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ తెలియజేశారు.
Read Also: PM Modi in Vizag: విశాఖకు ప్రధాని మోడీ.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం..
అయితే, హెచ్ఎండీఏ డెవలప్ చేసిన బుద్వేల్, నియో పోలీస్ లేఅవుట్లను సీఎస్ రామకృష్ణారావు పరిశీలించారు. నియో పోలీస్ దగ్గర నిర్మించిన ట్రంపెట్ వల్ల శంకర్ పల్లి, మోకిల ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని సీఎస్ చెప్పుకొచ్చారు. అలాగే, శంషాబాద్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ పై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. శంషాబాద్ మున్సిపాలిటీ నుంచి నగర ప్రజలకు అందిస్తున్న సేవలను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.