KTR Formula E-Car Race: ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణ సందర్భంగా కేటీఆర్ మొబైల్ ఫోన్లతో పాటు ల్యాప్ టాప్ ఇవ్వాలని ఏసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఏసీబీకి సెల్ ఫోన్లు అప్పగించాలన్న దానిపై కేటీఆర్ సమాధానం ఇచ్చారు. బలవంతంగా వ్యక్తిగతమైన సెల్ ఫోన్లు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి.. నేటి చట్ట ప్రకారం నిందితులు మొబైల్ ఫోన్లు వ్యక్తిగత పరికరాలు చూపించమని పోలీసులు బలవంతం చేయలేరు అని ఆయన పేర్కొన్నారు. ఫ్యూచర్ గేమింగ్ హోటల్స్ సర్వీసెస్లో సుప్రీంకోర్టు ఉంది.. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను యాక్సెస్ చేయవద్దని ఇప్పటికే ఈడీ కేసు తీర్పు కూడా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Read Also: CM Chandrababu: కుప్పం బాధితురాలికి చంద్రబాబు ఫోన్.. ఆర్థికసాయం ప్రకటన.. నిందితులకు వార్నింగ్..
ఇక, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20/3 కింద ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది అని కేటీఆర్ పేర్కొన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు, గోప్యత హక్కులో ఇది భాగం అన్నారు. అయితే, ఫార్ములా ఈ- రేస్ కేసు అనేది ప్రభుత్వ లావాదేవీకి సంబంధించినదే తప్ప, వ్యక్తిగత సంభాషణకు సంబంధించి కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించిన అవగాహన ఒప్పందాలతో పాటు ఆయా సంస్థలతో జరిగిన ఎంఓయూలు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. జరిగిన ప్రతి నగదు లావాదేవీ అధికారికంగా బ్యాంకుల ద్వారా జరిగినప్పుడు, అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ వ్యక్తిగత సమాచారం అడిగే హక్కు ఏసీబీకి లేదని ఆయన లీగల్ టీమ్ పేర్కొనింది.