గుంటూరు మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. కానీ... తమకు పూర్తి మెజార్టీ ఉన్న చోట ఆ పరిస్థతి ఎందుకు వచ్చిందన్న అంతర్మధనం జరుగుతోందట వైసీపీలో. తమకు వెన్నుపోటు పొడిచిన ఆ కట్టప్ప ఎవరంటూ లోకల్ లీడర్స్ ఆరా తీస్తున్నారట. జీఎంసీలో మొత్తం 57డివిజన్లు ఉంటే.... అందులో వైసీపీ 46, టీడీపీ 9, జనసేన 2 స్థానాల్లో గెలిచాయి.