తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిరవధిక సమ్మెకు మే 7వ తేదీ నుంచి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో, ప్రభుత్వం తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. మే డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటామని, వారితో చర్చలకు సిద్ధమని తెలిపారు. సమ్మెకు వెళ్లకుండా సమస్యల పరిష్కారం కోసం సంయమనం పాటించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మె వల్ల సంస్థకు నష్టం జరుగుతుందని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తాత్కాలికంగా తీసుకోలేని పరిస్థితి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిన తర్వాత అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
READ MORE: GT vs SRH: వీరబాదుడు బాదిన జీటి బ్యాటర్లు.. ఎస్ఆర్‌హెచ్ ముందు భారీ టార్గెట్!
ఈ అంశంపై ఆర్టీసీ జేఏసీ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి తమ సమస్యలను గుర్తించడాన్ని సానుకూలంగా స్వీకరిస్తున్నామని, త్వరితగతిన పరిష్కారం కోసం చర్చలకు సిద్ధమని తెలిపింది. ఉద్యోగులు గత కొన్నిమాసాలుగా తమ సమస్యలపై నిరసన తెలుపుతూనే ఉన్నారు. ముఖ్యంగా 2021 పీఆర్సీ అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్లతో ఉద్యోగులు ముందుకొచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వంతో జేఏసీ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో సమ్మెను నివారించే అవకాశం ఉంది!