Netflix సర్టిఫికేషన్‌తో Portronics Beem 560 స్మార్ట్ LED ప్రొజెక్టర్ లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Portronics Beem 560: డిజిటల్ యాక్సెసరీస్ మార్కెట్‌లో పేరొందిన పోర్ట్రానిక్స్ (Portronics) సంస్థ కొత్తగా Beem 560 స్మార్ట్ LED ప్రొజెక్టర్ ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ సర్టిఫికేషన్‌తో వచ్చిన ఈ ప్రొజెక్టర్, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరింత స్మార్ట్‌గా మార్చే ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ సరికొత్త పోర్ట్రానిక్స్ బీమ్ 560 (Portronics Beem 560)లో 5300 లూమెన్స్ LED లైట్ సోర్స్ ను అందించారు.
ఈ ప్రొజెక్టర్ ఫుల్ హెచ్‌డీ 1080p (1920×1080) రిజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒకేసారి 100 ఇంచుల వరకు భారీ స్క్రీన్ ప్రొజెక్షన్ ఇవ్వగల సామర్థ్యం ఈ ప్రొజెక్టర్‌కు ఉంది. స్పష్టమైన విజువల్స్ కోసం ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ కరెక్షన్ ఫీచర్లను అందించారు. అలాగే టేబుల్, షెల్ఫ్ లేదా బెడ్‌సైడ్ వంటి చోట్ల సులభంగా అమర్చుకునేందుకు అడ్జస్టబుల్ టిల్ట్ యాంగిల్ డిజైన్ ను అందించారు.
Also Read
- WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
- Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్, షోల్డర్ బటన్లతో రాబోతున్న iQOO 15 Ultra.. లాంచ్ ఎప్పుడంటే..?
ఈ ప్రొజెక్టర్ లో ఇన్‌బిల్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. దీని ద్వారా నేరుగా నెట్ఫ్లిక్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌లను ఉపయోగించవచ్చు. అదేవిధంగా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్‌ల నుంచి వైర్‌లెస్ స్క్రీన్ మిర్రరింగ్ కు కూడా మద్దతు ఇస్తుంది.

కనెక్టివిటీ పరంగా ఇందులో డ్యుయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, USB, HDMI, AUX పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆడియో కోసం ఇందులో ఇన్‌బిల్ట్ 3W స్పీకర్ ఉంది. మరింత సౌండ్ కోసం బ్లూటూత్ ద్వారా ఎక్స్‌టర్నల్ స్పీకర్లను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. తెల్లటి రంగులో వచ్చిన కాంపాక్ట్ డిజైన్ వల్ల బెడ్‌రూమ్, లివింగ్ రూమ్ లేదా షేర్డ్ స్పేస్‌లకు ఇది అనుకూలంగా ఉంటుంది.
MS Dhoni: అమరావతికి మహేంద్ర సింగ్ ధోని.. సీఎం చంద్రబాబుతో కీలక భేటీ..!

ఈ కొత్త Portronics Beem 560 స్మార్ట్ LED ప్రొజెక్టర్ ధర రూ.14,499గా నిర్ణయించారు. ఇది పోర్ట్రానిక్స్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ వంటి ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్లలో, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఈ ప్రొజెక్టర్‌కు కంపెనీ ఒక సంవత్సరం తయారీదారు వారంటీను అందిస్తోంది. మొత్తంగా హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం స్మార్ట్ ఫీచర్లతో కూడిన ప్రొజెక్టర్‌ను వెతుకుతున్న వారికి ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!