Off The Record: ఆ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలే సెగ పెడుతున్నారా..? అధిష్టానికిస్తున్న లీకులేంటి?
- యర్రగొండపాలెం నుంచి గెలిచిన తాటిపర్తి చంద్రశేఖర్..
- రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న నేత పొగబెడుతున్నారా?..
- యర్రగొండపాలెం నుంచి కొండేపికి ఆదిమూలపు సురేష్ ట్రాన్స్‌ఫర్..
- ఓటమి తర్వాత తిరిగి యర్రగొండపాలెం వైపు మాజీ మంత్రి చూపు..
- ఇప్పటికీ ఓ టీమ్‌తో టచ్‌లో ఆదిమూలపు..
- గతంలో సురేష్ సన్నిహితులు కొందరు టీడీపీలోకి..
- ఆదిమూలపు సురేష్ కూడా టీడీపీలో చేరతారని ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: 2024 ఎన్నికలలో కూటమి సునామీని తట్టుకుని నిలబడ్డ వైసీపీ ఎమ్మెల్యేల్లో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి గెలిచిన తాటిపర్తి చంద్రశేఖర్ ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చంద్రశేఖర్… ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటారు. ఆ విధంగా అధికార పార్టీ నేతలకు టార్గెట్ అవుతున్నారట. అదే సమయంలో నియోజకవర్గంలో రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత కూడా యర్రగొండపాలెం ఎమ్మెల్యేకి పొగబెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అధికార పార్టీ నుంచి ఉండే వత్తిడి సహజమే… ఊహించిందే అయినా…. సొంత వైసీపీ నాయకులు తీస్తున్న గోతులు అర్ధంకావడంలేదని వాపోతోందట ఎమ్మెల్యే వర్గం. గత ఎన్నికల ముందు అనూహ్యంగా టికెట్ దక్కించుకుని గెలిచారు చంద్రశేఖర్. అదే సమయంలో అప్పటిదాకా యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న మాజీమంత్రి ఆదిమూలపు సురేష్‌ని కొండేపికి ట్రాన్స్ఫర్ చేసింది వైసీపీ అధిష్టానం. అక్కడ పోటీ చేసి ఓడిపోయారాయన. ఆ తర్వాత అక్కడ నుంచే రాజకీయాలు చేస్తున్నా… ఆదిమూలపు చూపు మాత్రం యర్రగొండపాలెం వైపే ఉందని అంటున్నారట ఆయన సన్నిహితులు.
ఇప్పటికీ ఆయన నియోజకవర్గ వైసీపీలోని ఓ టీంతో టచ్‌లో ఉన్నారన్నది పార్టీ టాక్. స్థానిక పార్టీ నేతలకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతూ గ్యాప్ రాకుండా చూసుకుంటున్నారట. గతంలో ఆదిమూలపు సురేష్ తో సన్నిహితంగా ఉన్న కొందరు ఇటీవల టీడీపీలోకి వెళ్లారు. అందులో కూడా చాలా ఈక్వేషన్స్ ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. మాజీ మంత్రి సురేష్ కూడా టీడీపీకి వెళ్తున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అందుకు ఆయన రియాక్ట్ కానప్పటికీ.. గతంలో కొందరు.. తాజాగా మరికొందరు యర్రగొండపాలెం వైసీపీ నేతలు టీడీపీకి వెళ్లటం యాదృచ్చికం కాదనేది ఓ విశ్లేషణ. సురేష్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏం జరగక పోయినా.. ఏదో జరగబోతోందన్నది మాత్రం ఇన్‌సైడ్ టాక్. ఈ గందరగోళంలోనే…. సురేష్ తిరిగి యర్రగొండపాలెం రీబ్యాక్ అయ్యేందుకు పావులు కదుపుతన్నారన్న అనుమానాలు ఉన్నాయట. ఇక్కడ వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ ఉండటంతో ఆ పార్టీ నాయకుడిగా తిరిగి రావడం అంత తేలిక కాదని, ఒకవేళ ఆదిమూలపు తిరిగి రావడమంటూ జరిగితే ఏ రూపంలో అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు. ఈ చర్చ ఇలా నడుస్తుండగానే.. అసలు సిట్టింగ్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖరే టీడీపీలోకి వెళ్తున్నారన్న మరో ప్రచారం మొదలైంది.
Also Read
దాని ప్రభావంతోనే… ఇటీవల అసెంబ్లీకి వెళ్లినప్పుడు వైసీపీ కండువా లేకుండా వచ్చారని, కండువా మర్చిపోయావా.. లేక మార్చడానికి సిద్ధంగా ఉన్నావా అంటూ పార్టీ అధ్యక్షుడు జగన్ క్లాస్ పీకారంటూ ప్రచారం జరిగింది. కానీ… అదంతా తప్పుడు ప్రచారం అని ఖండించారు చంద్రశేఖర్. అయితే… గత ఎన్నికల్లో అప్పటి వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అండతోనే తాటిపర్తికి సీటు వచ్చిందని, ఇప్పుడు బాలినేని జనసేనకు వెళ్లటంతో చంద్రశేఖర్ కూడా వెళ్తారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది నియోజకవర్గంలో. ఇలా… ఇంటా బయటా… వత్తిళ్ళతో జోడు మద్దెల దరువులా మారిందట యర్రగొండపాలెం ఎమ్మెల్యే పరిస్థితి. ఓవైపు సోషల్ మీడియాలో విమర్శలకు ప్రభుత్వం నుంచి నోటీసులు, మరోవైపు వెళ్ళిపోతాడంటూ సొంత పార్టీవాళ్లే చేస్తున్న ప్రచారంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట ఆయన. మొత్తం మీద యర్రగొండపాలెం పిక్చర్ క్లియర్ అవ్వాలంటే… ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..