ఈ నెల 27వ తేదీన ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నిక జరగాల్సి ఉంది.. ఈ సమయంలో నాటకీయ పరిణాలు చోటు చేసుకున్నాయి.. ఎంపీపీ అభ్యర్థిగా ఉన్న ఆళ్ల ఆంజనేయరెడ్డి అరెస్ట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.. ఫిర్యాదు ఆధారంగా ఎంపీపీ అభ్యర్థితో పాటు మరో వ్యక్తి సుబ్బారావుపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అటెంప్ట్ మర్డర్ కేసు, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
కూటమి ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఉన్న సూపర్ సిక్స్ పథకాలపై సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్.. కూటమి ప్రభుత్వంపై మన ప్రశ్న - వారి సమాధానం.. తల్లికి వందనం ఎప్పుడు? జవాబు.. మీకు 11 సీట్లు.. ప్రతి మహిళకు నెలకు 1500/- ఎప్పుడు? జవాబు మీకు 11 సీట్లు.. ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల భృతి ఎప్పుడు? జవాబు మీకు 11 సీట్లు..
2024 ఎన్నికలలో కూటమి సునామీని తట్టుకుని నిలబడ్డ వైసీపీ ఎమ్మెల్యేల్లో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి గెలిచిన తాటిపర్తి చంద్రశేఖర్ ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చంద్రశేఖర్... ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటారు. ఆ విధంగా అధికార పార్టీ నేతలకు టార్గెట్ అవుతున్నారట. అదే సమయంలో నియోజకవర్గంలో రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత కూడా యర్రగొండపాలెం ఎమ్మెల్యేకి పొగబెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అధికార పార్టీ నుంచి ఉండే వత్తిడి సహజమే..
యర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పై తాజాగా పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు..
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై కేసు నమోదు చేశారు పోలిసులు.. ఎక్స్ లో మంత్రి నారా లోకేష్ పై ఎమ్మెల్యే చంద్ర శేఖర్ పెట్టిన పోస్ట్‌లపై స్థానిక టీడీపీ నేత కిషోర్ ఫిర్యాదు మేరకు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.