Manmadha Re-Release: శింబు కల్ట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘మన్మధ’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manmadha Re-Release: రీ-రిలీజ్ ట్రెండ్‌లో మరో కల్ట్ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. తమిళ స్టార్ హీరో శింబు, నటి జ్యోతిక జంటగా నటించిన సూపర్ హిట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘మన్మధ’ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను జూలై 18న ఆంధ్రప్రదేశ్, నైజాం ప్రాంతాల్లో గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
2004లో తమిళంలో ‘మన్మధన్’ పేరుతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలక్షన్స్ ను అందుకుంది. ఆ తర్వాత ‘మన్మధ’ పేరుతో తెలుగులో విడుదలై ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా శింబు నటన, కథలోని ఉత్కంఠభరితమైన మలుపులు, యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా ఇప్పటికీ కల్ట్ క్లాసిక్‌గా అభిమానుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో రీ-రిలీజ్ అవుతున్న పలు క్లాసిక్, డబ్బింగ్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పాత సినిమాలను కొత్త అనుభూతితో పెద్ద తెరపై చూసేందుకు సినీ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ‘మన్మధ’ రీ-రిలీజ్ కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ.జె. మురుగన్ దర్శకత్వం వహించగా, కథ, స్క్రీన్‌ప్లేను శింబు స్వయంగా అందించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. శింబు, జ్యోతికల కెమిస్ట్రీతో పాటు థ్రిల్లింగ్ కథనం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..