Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Posani Krishna Murali 2

Off The Record: పోసానికి క్షవరం అయ్యాకగాని వివరం తెలిసి రాలేదా?

Published Date :September 9, 2025 , 9:58 pm
By Sudhakar Ravula
  • పోసానికి క్షవరం అయ్యాకగాని వివరం తెలిసి రాలేదా?..
  • ఇక రాజకీయం వద్దని దండం పెట్టేస్తున్నారా?..
  • తన మూలాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ప్లాన్‌లో ఉన్నారా?..
  • గతంలో బాబు, పవన్‌, లోకేష్‌ టార్గెట్‌గా నోటికి పని..
  • పవన్‌ మీద నోరు పారేసుకున్నాక కాల్‌షీట్స్‌ డైరీ ఖాళీ..
  • రాష్ట్రంలో అధికారం మారాక కేసుల మీద కేసులు..
  • జైళ్ళు మార్చుతూ జంబ్లింగ్‌..
  • పోసాని మళ్ళీ కలం పట్టి కథ రాసేశారా?..
  • అరుణారెడ్డి పేరుతో జర్నలిస్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ సినిమా కథ..
Off The Record: పోసానికి క్షవరం అయ్యాకగాని వివరం తెలిసి రాలేదా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: పెద్దలు ఊరికే చెప్పరు… ఏదైనా అనుభవిస్తేగానీ.. దాని లోతెంతో తెలియదని. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ కమ్ రైటర్ కమ్ పొలిటీషియన్ పోసాని కృష్ణమురళికి. ఆ ఎదురు కావడం కూడా అట్టా ఇట్టా కాదు.. కేసు మీద కేసులేసి పెట్టిన జైల్లో పెట్టకుండా.. మార్చి మార్చి.. తిప్పి తిప్పి నరకానికి నకలు ఇలా ఉంటుందని చూపించారు. అప్పటికికాని ఆయనకు తత్వంబోధపడలేదు. దాంతో… ఇప్పుడాయన నాకు రాజకీయం వద్దు రాజా అంటూ రెండు చేతులెత్తి దండం పెట్టేస్తున్నారట. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయనగారు తన మూలాల్లోకి రీ ఎంట్రీ ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం.

Read Also: Off The Record: పవన్ కల్యాణ్‌ పొలిటికల్ ఇరకాటంలో పడుతున్నాడా..?

మెంటల్ కృష్ణ అనే సినిమా కూడా తీశారు పోసాని. ఆ సినిమా ఫక్తు ఆయన మనస్తత్వానికి అద్దంపడుతుందనే వాళ్లు కూడా ఉన్నారు. దాదాపు వంద సక్సెస్ ఫుల్ సినిమాలకు రైటర్ గా పని చేసి ఐదు వందలకుపైగా సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్ గా నటించిన కృష్ణమురళికి రాజకీయాలంటే తెగ ఇది. అప్పట్లో చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఆయన గొప్ప నాయకుడని కొనియాడుతూ లక్షల రూపాయల సొంత డబ్బు ఖర్చు పెట్టి మరీ పేపర్లకు ఫ్రంట్ పేజీలలో ఫుల్ లెంగ్త్ యాడ్స్ ఇచ్చారు పోసాని. ఆ తర్వాత 2009లో మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరి చిలకలూరిపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం క్లోజ్ అయ్యాక.. చిరంజీవిని వదిలేసిన పోసాని మనసు వైఎస్ రాజశేఖరరెడ్డి మీదకు మళ్లి ఆయనకు మద్దతుదారుడిగా మారిపోయారు. వైఎస్ మరణం తర్వాత ఆయన జగన్ వైపు టర్న్ తీసుకున్నారు. కడప పార్లమెంట్ ఉప ఎన్నికల్లో జగన్ తరఫున ప్రచారం కూడా చేశారు. అలా అలా.. వైసీపీ అధ్యక్షుడికి దగ్గరైపోయిన పోసాని ఆ ప్రభుత్వ హయాంలో ఫిల్మ్, నాటకరంగ సంస్థల చైర్మన్ గా నియమితులయ్యారు. వైసీపీ నేత హోదాలో చంద్రబాబు, లోకేష్‌, పవన్ కళ్యాణ్‌ టార్గెట్ గా తీవ్రమైన విమర్శలు చేసేవారు పోసాని. పవన్ కళ్యాణ్‌ మీద అయితే ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. అప్పటి నుంచి సినిమా అవకాశాల్లో ఆయన ఫేట్ తిరగబడిపోయింది. ఒకప్పుడు కాల్ షీట్లకు ఖాళీ లేని పోసాని డైరీలో.. అన్నీ ఖాళీ పేజీలే మిగిలిపోయాయి.

Read Also: Best Buffalo Breed: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. రోజుకు 25 లీటర్లు ఇచ్చే ఈ గేదెలను కొనండి!

జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని మనసా వాచా నమ్మిన వైసీపీ కేడర్ కు నిరాశ ఎదురైతే… పోసానికి కేసులు మిగిలాయి. అప్పట్లో ఆయన చేసిన కామెంట్లపై రాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 15 కేసులు నమోదుయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాజంపేట పోలీసులు ఫస్ట్ టైం పోసానిని అరెస్ట్ చేస్తే… ఆ తర్వాత గుంటూరు, కర్నూల్, విజయవాడ, నరసరావుపేట పోలీసులు వరుసకట్టారు. స్టేసన్ల మీద స్టేసన్లలో కేసులు నమోదు కాగా… జైళ్ల మీద జైళ్లు మార్చి దాదాపు 20 రోజులపాటు ఆయన్ను రాష్ట్రంలో సగ భాగం తిప్పారు పోలీసులు. జగన్ ఓటమి తర్వాత కూడా పోసాని కూటమి నేతల మీద యధావిధిగా రెచ్చిపోయారు. ఆ తర్వాత కేసులు పెడతారనే ఉప్పందిందో ఏమో… ఒక రోజు హటాత్తుగా తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని… ఇక రాజకీయాల గురించి మాట్లాడనని ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. అయినా కేసులు ఆగలేదు. కట్ చేస్తే జైల్ జీవితం నుంచి బయటపడి కోలుకున్న కృష్ణమురళి ఇప్పుడు మళ్లీ కలం పట్టారట. జర్నలిస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఆపరేషన్ అరుణారెడ్డి పేరుతో సినిమా తీయడానికి కథ రెఢీ చేసుకున్నట్టు సమాచారం. వచ్చే నెల 22న ఈ సినిమాకి క్లాప్, కొబ్బరికాయ కొట్టబోతున్నారట పోసాని. ఈ సంగతి తెలిసిన వాళ్లు ఎవరైనా… సినిమా తీస్తున్నారట కదా… అని అడిగితే అవునన్నా అంటూనే అందులో రాజకీయాలేమీ ఉండవన్నా… ఏ నాయకుడి గురించి సినిమాలో ప్రస్తావన రాదన్నా… అని జాలిగా చెబుతున్నారట. అంతకు ముందు జాలీగా మాట్లాడే పోసాని ఇప్పుడు జాలిగా మాట్లాడ్డం చూసి పాత జ్ఞాపకాలు బాగా వెంటాడుతున్నట్టున్నాయ్… అందుకే రాజకీయాల్లేవ్ అని అడగక ముందే చెబుతున్నారంటూ గుసగుసలాడుకుంటున్నారట టాలీవుడ్‌లో.

Read Also: Nara Lokesh: కేటీఆర్‌ని ఎందుకు కలవకూడదు..? దానికి రేవంత్‌రెడ్డి పర్మిషన్‌ తీసుకోవాలా..?

మాంచి రచయితగా పేరున్న పోసానికి కేరక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా రావడంతో కలానికి క్యాప్ పెట్టి పక్కన పడేశారు. పవన్ ఎపిసోడ్ తర్వాత వేషాలు లేకపోవడంతో తనకు ఫుడ్ పెట్టిన పెన్ ను మళ్లీ చేతబట్టారట పోసాని. ఆపరేషన్ అరుణా రెడ్డి సినిమాకు కథా, స్క్రిన్ ప్లే, డైరెక్షన్లతోపాటు ఒక కేరక్టర్ కూడా వేస్తున్నట్టు తెలిసింది. అంతా కొత్త నటీనటులేనట. సినిమాలో ఎక్కువ భాగం రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీలోనే షూటింగ్ ఉంటుందంటున్నారు. చూడాలి పోసాని సెకండ్ ఇన్నింగ్స్ హిట్ కొడుతుందో ఫ్లాప్‌ అవుతుందో….. తిట్టే నోరు తిరిగే కాలు తిన్నగా ఉండవంటారు. పోసాని వైఖరి ఎలా ఉంటుందో చూడాలి మరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Aruna Reddy
  • off the record
  • Posani Krishna Murali
  • Tollywood

తాజావార్తలు

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Chanakya Niti: కోట్లు సంపాదించాలన్నా .. కూటికి లేని బిచ్చగాడు కావాలన్నా ఈ అలవాట్లే కారణం.. చాణక్యుడు చెప్పిన కెరీర్ సీక్రెట్స్!

  • Prabhsimran Singh: టెన్షన్ వద్దు, స్వేచ్ఛగా ఆడమన్నాడు.. నా సక్సెస్‌కు కారణం అతడే!

  • Fire Accidnet: ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’ సెట్‌లో అగ్ని ప్రమాదం..

ట్రెండింగ్‌

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions