Bunny – Pooja: బన్నీ సినిమాను పూజా హెగ్డే రిజెక్ట్ చేసిందా? లైవ్ కాల్లో షాకింగ్ ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bunny – Pooja: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జోడీ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన క్రేజ్. ‘డీజే’, ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత ఈ హిట్ పెయిర్ మళ్లీ వెండితెరపై ఎప్పుడు కనిపిస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే బన్నీతో పూజా హెగ్డే మూవీ చేయకపోవడం వెనుక ఉన్న ఓ ఆసక్తికర సీక్రెట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటికి వచ్చింది. రీసెంట్గా ఓ టాక్ షోలో పాల్గొన్న పూజా హెగ్డేకు అల్లు అర్జున్ ఫోన్ చేసి మాట్లాడారు. సరదాగా సాగుతున్న వారి సంభాషణ మధ్యలో బన్నీ వేసిన ప్రశ్నతో స్టూడియో మొత్తం ఒక్కసారిగా అవాక్కైంది. “పూజా.. మన కాంబినేషన్లో సినిమా చేద్దామని మా వాళ్లు అడిగితే, నాతో వర్క్ చేయడం ఇష్టం లేదని చెప్పావంట కదా.. నిజమేనా?” అంటూ బన్నీ నేరుగా నిలదీశారు. బన్నీ సినిమాను పూజా హెగ్డే రిజెక్ట్ చేసిందనే ఈ ప్రస్తావన రాగానే అక్కడ ఒక్కసారిగా షాకింగ్ వాతావరణం నెలకొంది.
అయితే ఊహించని ఈ ప్రశ్నకు పూజా హెగ్డే ఏమాత్రం తడబడకుండా వెంటనే స్పందించింది. “మీరు సాధారణంగా హీరోయిన్లను రిపీట్ చేయరు కదా సర్..” అంటూ తనదైన స్టైల్లో తప్పించుకునే ప్రయత్నం చేసింది. అంతటితో ఆగకుండా, “నిజానికి నేను రిజెక్ట్ చేయలేదు.. మీరే నాతో పనిచేయడానికి ఇష్టపడలేదని నాకు తెలిసింది.. మరి అసలు ఏం జరిగిందో నాకే అర్థం కావడం లేదు” అంటూ సస్పెన్స్‌ను బన్నీపైకే నెట్టేసింది. వీరిద్దరి చర్చ మధ్యలోకి వచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం పూజాపై సరదా సెటైర్లు విసిరారు. ‘డీజే’, ‘అల వైకుంఠపురములో’ తర్వాత తెలుగు సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టకుండా తరచూ ముంబై ఫ్లైట్ ఎక్కేస్తోందంటూ నవ్వులు పూయించారు. చివరగా.. ఈ పుకార్లకు ఫుల్స్టాప్ పెడుతూ బన్నీతో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవాలని తాను ఎంతగానో కోరుకుంటున్నట్లు పూజా హెగ్డే స్పష్టం చేసింది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ తాలూకు వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Also Read
తాజావార్తలు
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!