OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
- తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి
- రెండు సీట్లు, బాధ్యతలు తీసుకోబోతున్న కేటీఆర్, హరీష్‌రావు
- వచ్చే మార్చిలో ఎన్నికలు, 70 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి
- రెండు సీట్లు కొడితే కేడర్‌కు మనోధైర్యం, కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడేసే ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: పంచేసుకున్నారా….? వాళ్ళిద్దరూ షేర్ చేసుకున్నారా? బావా బావమరుదులు ఇద్దరూ…. నీకది, నాకిది అంటూ ఒక అవగాహనకు వచ్చేశారా? కేటీఆర్, హరీష్‌రావు మధ్య ఏ విషయంలో అండర్స్టాండింగ్ కుదిరిందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి? ప్రస్తుత పరిస్థితుల్లో అది వర్కౌట్ అయ్యే అవకాశం ఎంత?. తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలైంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లకు ఎలక్షన్ టైం దగ్గర పడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దీన్ని సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ప్రతిపక్షం బీఆర్ఎస్… రెండు నియోజకవర్గాల కోసం కొత్తగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే… ఇద్దరు కీలక నాయకులు కేటీఆర్, హరీష్‌రావు చెరో సీటు బాధ్యతలు తీసుకున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఒక సీటు కాగా… రెండోది వరంగల్-ఖమ్మం-నల్గొండ. ఈ రెండిటికీ… వచ్చే మార్చిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవి పేరుకు రెండు ఎమ్మెల్సీ సీట్లు అయినా… ఈ పరిధిలో 70దాకా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండటంతో… అన్ని పార్టీలు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్ల నమోదును జోరుగా చేయిస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ… ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందుంటే.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు ఓటర్ నమోదు బాధ్యతలు అప్పగించి గ్రౌండ్ సిద్ధం చేసుకుంటోంది.
ఓటర్లంతా విద్యావంతులు కావడం, రాష్ట్రంలోని మెజార్టీ నియోజకవర్గాలు ఈ ఎన్నిక పరిధిలో ఉండటంతో… రెండు సీట్లను ఎలాగైనా గెలిచి సత్తా చాటాలనుకుంటోందట బీఆర్ఎస్. ఈ రెండు సీట్లు కొడితే… ఇటు తమ కేడర్‌లో మనో ధైర్యాన్ని నింపడంతో పాటు… అటు అధికార పక్షాన్ని డిఫెన్స్‌లో పడేయవచ్చన్నది గులాబీ ప్లానింగ్ అట. అందుకోసం పాత వ్యూహాలకు కొత్తగా పదును పెడుతున్నట్టు తెలుస్తోంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోవడం కోసం డైరెక్ట్‌గా కేటీఆర్, హరీష్‌రావే చెరో నియోజకవర్గం బాధ్యతలు తీసుకోబోతున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కేటీఆర్, ఖమ్మం- నల్గొండ- వరంగల్ సీటుకు హరీష్‌రావు ఇన్‌ఛార్జ్‌లుగా ఉండబోతున్నారన్నది తెలంగాణ భవన్ ఇన్సైడ్ టాక్. పార్టీలోని ఇద్దరు కీలక నేతలు ఇలా… బాధ్యతలు తీసుకుంటే… టాప్ టు బాటమ్ అటెన్షన్ వస్తుందని, కాస్త అటు ఇటుగా ఆలోచిస్తున్న నాయకులు సైతం వోవరాల్‌గా సెట్ అవుతారని భావిస్తున్నారట. ఇద్దరు ముఖ్య నాయకులు కలిసి రెండు చోట్ల అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించాలన్నది అసలు ప్లానింగ్‌గా తెలుస్తోంది. ఇక లెక్కల పరంగా చూసుకుంటే…. హైదరాబాద్- రంగారెడ్డి పరిధిలో కేటీఆర్‌కు మంచి ఫాలోయింగ్‌తో పాటు అభిమానులు ఎక్కువగా ఉంటారన్నది గులాబీ కేలిక్యులేషన్. దాంతోపాటు గతంలో మునిసిపల్ శాఖ మంత్రిగా చేసిన కేటీఆర్‌కు ఇక్కడి నియోజకవర్గాలపై మంచి పట్టు ఉంది.
Also Read
దీంతో కేటీఆర్ ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోకి వచ్చే ఎమ్మెల్సీ స్థానంపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. సిటీ నుంచి మహబూబ్‌నగర్ పరిధిలో వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు ఇస్తే… పార్టీకి కలిసి వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారట. ఇక మరో సీటు విషయానికి వస్తే… గతంలో కూడా నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఇన్చార్జ్గా వ్యవహరించారు హరీష్‌రావు. దాంతో… మరోసారి ఆయనకే ఆ బాధ్యతలు ఇస్తే… పట్టు పెరుగుతుందని భావించారట. ఆ లిమిట్స్‌లో ఇప్పటికే పలుమార్లు హరీష్‌రావు పర్యటనలు చేశారు కూడా. ఇలా ఇద్దరు కీలక నేతలు రెండు నియోజకవర్గాలపై దృష్టి పెట్టి కార్యకర్తల నుంచి మాజీ మంత్రుల వరకు అందర్నీ… ఒక్క తాటి పైకి తీసుకుని రావాలనుకుంటున్నారట. ఇవి పేరుకు రెండు నియోజకవర్గాలు అయినప్పటికీ… ఆరు ఉమ్మడి జిల్లాలు, దాదాపు 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. అందుకే…. ఈ ఎమ్మెల్సీ స్థానాలను అంత ఈజీగా వదిలిపెట్టకూడదని భావిస్తోందట బీఆర్ఎస్. ఈ పక్కా ప్లానింగ్ మొత్తం అందుకోసమేనన్నది గులాబీ వాయిస్. ఓటర్ నమోదు ప్రక్రియ ముగిసిన వెంటనే…ఇద్దరు నేతలు జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నట్టు చెబుతున్నాయి బీఆర్ఎస్ వర్గాలు.
తాజావార్తలు
-
OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
-
OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
-
YS Jagan: స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..
-
Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
-
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?