Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కొత్త లెక్కలు..
- కామ్రేడ్స్ అడుగులపై రకరకాల చర్చలు..
- ఫ్రంట్ ఏర్పాటుతో తన దారి తాను వెదుక్కున్న సీపీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుత్తీ కొడవలికి క్లారిటీ వచ్చేసింది. మరి కంకీ కొడవలి సంగతేంటి? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరో దారి వెదుక్కుంటారా? ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దగ్గరైన సీపీఎం ఇప్పుడెందుకు కలిసి రావడం లేదు? మిత్రపక్షం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు విషయంలో సీపీఐ ఇంకా ఎందుకు నానుస్తోంది? వాళ్ల లెక్కలు వేరే ఉన్నాయా? అదే నిజమైతే… ఆ కేలిక్యులేషన్స్ ఏంటి?
తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన చర్చల్లో కొత్త కొత్త అంశాలు తెర మీదికి వస్తున్నాయి. పోటా పోటీ వ్యూహాల్లో భాగంగా జాగ్రత్తగా పావులు కదుపుతున్నాయి పార్టీలు. ఇక అధికార పార్టీగా… రెండు సీట్లు కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట. కలిసి వచ్చే మిత్రులు ఎవ్వర్నీ వదలకుండా… జాగ్రత్తగా డీల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కామ్రేడ్స్ ఉన్నా…గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌తో కలిసి నడవలేదు సీపీఎం.
Also Read
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
- OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
- Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
- Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
కానీ…. సీపీఐ, హస్తం పార్టీ కలిసే పని చేశాయి. ఎన్నికల తర్వాత కూడా మైత్రి కొనసాగుతోంది. కానీ… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కామ్రేడ్స్ ఆలోచన ఏంటి..? ఎవరి దారి ఎటు అన్న విషయంలో క్లారిటీ రాలేదు. ఇటీవల జరిగిన RTC గుర్తింపు సంఘం ఎన్నికల్లో CPM అనుబంధ సంఘాలు కాంగ్రెస్‌తో కలిసి పని చేశాయి. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఆ పార్టీ ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని తన దారి తాను వెదుక్కుంది. అభ్యర్ధిని కూడా ప్రకటించేశారు. సో…గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు ఉండబోదని తేలిపోయింది. ఇక మిగిలిన సీపీఐ… ఇంకా అధికారికంగా ఏ నిర్ణయం ప్రకటించలేదు.
తన మద్దతు ఎవరికి అన్నది క్లారిటీ రావల్సి ఉంది. నవంబర్ 5న సీఎం రేవంత్‌తో సీపీఐ నాయకులు భేటీ కాబోతున్నారు. ఆ మీటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ సీపీఐకి ఇచ్చిన హామీలు… పెండింగ్ పనుల్లాంటి అన్ని అంశాలపై చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారని అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతుపై ఆ మీటింగ్ తర్వాతే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారట సీపీఐ నేతలు. అయితే… మిత్రపక్షమైనా…. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విషయంలో తన పని తాను చేసుకోవాలని… మద్దతు విషయంలో సందర్భానుసారంగా పని చేయాలని సీపీఐ జాతీయ నాయకుడు ఒకరు ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో ప్రస్తావించారట. ఈ పరిస్థితుల్లో సీపీఐ కలిసి వచ్చే విషయంలో కొంత సానుకూలతే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద సీపీఎం తన దారి తాను చూసుకుంది. సీపీఐ మాత్రం ఆచితూచి అడుగులు వేయాలనే లెక్కలో ఉంది.
తాజావార్తలు
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?