Bangladesh: ‘‘షేక్ హసీనా వీడియో, RAW ఏజెంట్’’.. సంచలనంగా బంగ్లా మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మరణం!
- సంచలనంగా మారిన బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారి మరణం..
- RAW ఏజెంట్ అని ఆయనపై ఆరోపణలు..
- షేక్ హసీనా దేశం విడిచివెళ్తున్న వీడియో వెనక హస్తం..
- ఢాకాలోని నదిలో శవంగా తేలిన మాజీ అధికారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి ఫ్లైట్ లెఫ్టినెంట్ కేఎం తహ్సీన్ సౌరీ అనుమానాస్పద స్థితిలో మరణించడం ఆ దేశంలో సంచలనంగా మారింది. 2024లో అప్పటి ప్రధాని షేక్ హసీనా హింసాత్మక ఉద్యమం తర్వాత దేశం విడిచి వెళ్తున్న వీడియో చిత్రీకరించినట్లు భావిస్తున్న 28 ఏళ్ల సౌరీ మృతదేహం అక్టోబర్ 28న ఢాకాలోని తురాగ్ నదిలో లభ్యమైంది. అంతకుముందు రోజు, అక్టోబర్ 27న తన మోటార్‌సైకిల్ మరమ్మతు చేయించేందుకు ఓ స్నేహితుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. 24 గంటలకు పైగా గడిచిన తర్వాత నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు.
సౌరీని హత్య చేసి ఉంటారని ఆయన తండ్రి, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, భారత నిఘా సంస్థ RAWతో సౌదీకి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఆయనను సైన్యం నుంచి బలవంతంగా రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. ఈ వివాదాల నేపథ్యంలో కొన్ని నెలల క్రితం ఓ పాడ్‌కాస్ట్‌లో సౌరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Also Read
- ASEAN Summit 2026: ప్రపంచానికి ఇప్పుడు శాంతి, స్థిరత్వమే అత్యవసరం.. ఆసియాన్ సదస్సులో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
- The Muslim 500 List 2027: ప్రపంచంలో టాప్-500 ముస్లింల జాబితా.. షారూఖ్‌తో సహా భారత్ నుంచి 22 మంది!
- Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
- Israel Hezbollah: ఓవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్యలు.. హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ మెరుపుదాడి!
భారత నిఘా సంస్థతో సంబంధాల ఆరోపణలు..
షేక్ హసీనా దేశం విడిచి వెళ్తున్న సమయంలో వీడియో చిత్రీకరించిన సౌరీతో పాటు వైమానిక దళ అధికారి లెఫ్టినెంట్ రిఫాత్ అష్రఫీ ఉన్నారని జమాతే ఇస్లామీకి అనుబంధంగా ఉన్న ‘అమర్ దేశ్’ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ వీడియోపై బంగ్లా ఎయిర్‌ఫోర్స్ విచారణ జరిపి, కొందరు అధికారులు భారత నిఘా సంస్థ RAWతో సంబంధాలున్నట్లు వెల్లడైందని ఆ పత్రిక ఆరోపించింది. ఈ ఆరోపణల్లో సౌదీ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. దీని తర్వాత ప్రభుత్వం ఆయన పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
అయితే, ఈ పత్రికా కథనాన్ని బంగ్లాదేశ్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ (ISPR) ఖండించింది. విదేశీ నిఘా సంస్థతో సంబంధాల కారణంగా సౌరీని విధుల్లో నుంచి తొలగించలేదని స్పష్టం చేసింది. వైమానిక దళ చట్టాలు, నిబంధనల ప్రకారం ఇద్దరు అధికారులు వేర్వేరు కారణాలతో పదవీ విరమణ చేయించినట్లు వివరించింది.
పాడ్‌కాస్ట్‌లో సంచలన వ్యాఖ్యలు..
ఈ ఏడాది జూలైలో ‘స్పీక్ విత్ రషీద్’ అనే పాడ్‌కాస్ట్‌లో సౌరీ పాల్గొన్నారు. షేక్ హసీనా వీడియో తీసినందుకు వైమానిక దళంలో ఉద్యోగం కోల్పోయారా? అనే ప్రశ్నలకు ‘‘అందుకు అవకాశం ఉండొచ్చు’’ అని సమాధానం ఇచ్చారు. తనకు RAWతో సంబంధాలున్నాయంటూ అమర్ దేశ్ ప్రచురించిన కథనం కేవలం ప్రచారంలో భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ పాడ్‌కాస్ట్ వైరల్ కావడంతో తన కుమారుడు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసేవాడని సౌరీ తండ్రి ఎనాయెతుల్ కరీం హెలాల్ అన్నారు. తనకు భయంగా ఉందని అప్పుడప్పుడు చెప్పేవాడని, అయితే దీనికి భయపడుతున్నాడో మాత్రం వివరించలేదని వెల్లడించారు.
2025 జూలై 21న మైల్స్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన యుద్ధవిమాన ప్రమాదంపై కూడా సౌరీ ప్రశ్నలు లేవనెత్తారు. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన చెంగ్డు FT-7BGI శిక్షణ యుద్ధవిమానం పాఠశాల ప్రాంగణంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు సహా 37 మంది మరణించగా, 170 మందికి పైగా గాయపడ్డారు.
షేక్ హసీనా కుమారుడి స్పందన..
మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్.. సౌరీ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. సౌరీపై తప్పుడు ప్రచారం చేసి ఆయన కెరీర్ నాశనం చేశారని అన్నారు. అమర్దేశ్ కథనంలో ఆయన జీవితం ఇబ్బందుల్లో పడిందని, వైమానిక దళంలోని కొన్ని అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి కారణమయ్యాయని జాయ్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Sammakka Sagar Barrage: సమ్మక్క సాగర్ బ్యారేజీకి త్వరలోనే ఎన్ఓసీ.. సీఎం రేవంత్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం హామీ..!
-
IPL Retentions 2027: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027కు ఇద్దరు స్టార్స్ దూరం.. ఇక అంతే సంగతులు!
-
Sita in Ramayana: సీత యోధురాలే.. ఆ సాక్ష్యంతో విమర్శకుల నోళ్లు మూయించిన డైరెక్టర్ నితీష్ తివారి..!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
SEC Anil Chandra Punetha: నామినేషన్ల ప్రక్రియపై ఎస్ఈసీ సీరియస్.. కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు.. అవసరమైతే ఎఫ్ఐఆర్లు..!
ట్రెండింగ్
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!