క్షవరం అయితేగానీ... వివరం తెలీదంటారు. ఆ యాక్టర్ టర్న్‌డ్ పొలిటీషియన్‌కు ఈ సామెత సరిగ్గా అతికినట్టు సరిపోయిందా? ఆయనకా క్షవరం కూడా అట్టా ఇట్టా కాకుండా.... మాడు మంటపుట్టేలా.... ఇక నాకొద్దు బాబోయ్, నన్నొదిలేయండ్రా నాయనోయ్... అంటూ గావు కేకలు పెట్టేలా అయ్యిందా? అందుకే మీకు, మీ రాజకీయాలకో దండంరా బాబూ... అంటూ సాష్టాంగ నమస్కారం పెట్టిమరీ చెబుతున్నారా? అంతలా తత్వం బోథపడ్డ ఆ నటుడు ఎవరు? ఏంటా దండాల కథ?