Off The Record: ఆంధ్రప్రదేశ్ అధికార కూటమి భాగస్వాములైనా… ఫీల్డ్‌లో ఫ్రంట్ లైన్‌లో కనిపించడం లేదు జనసేన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది. దీంతో అసలు అలా ఎందుకు జరుగుతోందని రాజకీయ వర్గాలు ఆరా తీయడం మొదలైపోయింది. యూరియా కొరతలాంటి రైతు సమస్యలు, ప్రజల ఇతర ఇబ్బందులు, కూటమి పార్టీల హామీల అమలు లాంటి అంశాల్లో… వైసీపీ అటాకింగ్ మోడ్‌లోకి వెళ్తోంది. అయినాసరే… కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న జనసేన ఎమ్మెల్యేల స్వరం మాత్రం వినిపించడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. నియోజకవర్గాల్లో ప్రజలకు అండగా నిలబడి, పార్టీ ఉనికిని బలంగా చాటుకోవాల్సిన సమయంలో ఎమ్మెల్యేలు ఎందుకు మౌనం వహిస్తున్నారన్న ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కూటమి టీమ్‌లో బలమైన శక్తిగా ఉండి కూడా… ఎందుకు ఫ్రంట్‌లైన్‌కు రాలేకపోతున్నారన్నది బిగ్ క్వశ్చన్. అటు సీఎం, ఇటు తమ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం కౌంటర్ చేయండి, కార్నర్ చేయండని పదేపదే చెబుతున్నా…జనసేన ఎమ్మెల్యేల్లో స్పందనలు ఎందుకు రావడంలేదన్న చర్చ జరుగుతోంది.
Read Also: Chia seeds ఇలా తీసుకంటే బండి షెడ్ కు వెళ్లసిందే.. జాగ్రత్త సుమీ!
ఇటీవల విశాఖలో జరిగిన సేనతో సేనాని సమావేశంలో కూడా వైసీపీ వ్యవహార శైలి ప్రస్తావనకు వచ్చిందట. ప్రతిక్షాన్ని గట్టిగా కౌంటర్ చేయాలని అప్పుడు జరిగిన ఇంటర్నల్ మీటింగ్‌లో పవన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. విడిగా జనసేనతోపాటు కూటమి ఐక్యత, పరిపాలన విషయంలో.. వైసీపీ సోషల్ మీడియాలోతప్పుడు ప్రచారం చేస్తోందని, దాన్ని ఎక్కడికక్కడ ఖండించాలని చెప్పారట పవన్. అయితే… అప్పుడు శ్రద్ధగా విన్న నాయకులు తర్వాత మాత్రం మనకెందుకులే అన్నట్టుగా ఉన్నారన్నది జనసేన వర్గాల మాట. ఏం మాట్లాడితే ఎలాంటి తంటాలు వస్తాయోనన్నది వాళ్ళందరి భయంగా తెలుస్తోంది. ఆ భయం వైసీపీ విషయంలో కాదని, కూటమి పెద్దల గురించేనని చెప్పుకుంటున్నారు. ఒకటి మాట్లాడితే తక్కువ, రెండు మాట్లాడితే ఎక్కువ అన్నట్టుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో… చిన్న తేడా జగిరినా… బోర్డర్ లైన్ ఎందుకు క్రాస్ అయ్యావంటూ పార్టీ పెద్దలు పిలిచి చివాట్లు పెడతారు. దానికంటే మనం గమ్మున ఉండటం మంచిదికదా అన్న అభిప్రాయంతో ఉన్నారట ఎక్కువ మంది జనసేన శాసనసభ్యులు. తమ నియోజకవర్గాల్లో వైసీపీ ఫుల్ స్పీడ్‌గా రోడ్డు ఎక్కుతున్నా…చూస్తూ ఉండటం తప్ప యాక్టివ్ మోడ్‌లోకి ఎమ్మెల్యేలు రాలేకపోతున్నట్టు తెలుస్తోంది.
Read Also: Asia Cup 2025: పాకిస్థాన్‌పై విజయం పక్కా.. భారత్ అదృష్టం దుబాయ్ చేరుకుంది!
2024లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన… దాన్ని తిరిగి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నా…గ్రౌండ్ లెవల్‌లో మాత్రం ఆ పరిస్థితులు కనిపించడం లేదంటున్నారు. అదే వైసీపీకి బలంగా మారుతోందన్న అభిప్రాయం బలపడుతోంది జనసేన వర్గాల్లో. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో గట్టి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైసీపీ… అక్కడి ఎమ్మెల్యేలను కార్నర్ చేస్తోంది. కానీ… వాళ్ళు మాత్రం కౌంటర్ చేసుకునే ప్రయత్నాల్లో లేరని మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. జనసేన తరుపున పార్టీ అధినేత పవన్ తప్ప మరో నాయకుడు నోరు మెదపడం లేదు. 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలు,ఇద్దరు మంత్రులు ఉన్నారు. చివరికి పార్టీకి చెందిన మంత్రులు కూడా డిపార్ట్‌మెంటల్ ఇష్యూస్ కే పరిమితం అవుతున్నారు తప్ప… ఫీల్డ్ లెవెల్ లో వైసీపీని స్ట్రాంగ్ కౌంటర్ చేయలేకపోతున్నారన్న అభిప్రాయం జనసేన వర్గాల్లోనే ఉందట. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశాల గురించి అయితే.. ఇక మాట్లాడుకోవాల్సిన పనేలేదు. మొత్తం మీద కీలకంగా ఉండాల్సిన జనసేన ఎమ్మెల్యేలు రకరకాల పరిమితుల కారణంతో నోరు మెదపకపోతే…. అంతిమంగా పార్టీకే నష్టం జరుగుతుందన్న అభిప్రాయం బలపడుతోంది.