ఆంధ్రప్రదేశ్ అధికార కూటమి భాగస్వాములైనా... ఫీల్డ్‌లో ఫ్రంట్ లైన్‌లో కనిపించడం లేదు జనసేన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది. దీంతో అసలు అలా ఎందుకు జరుగుతోందని రాజకీయ వర్గాలు ఆరా తీయడం మొదలైపోయింది. యూరియా కొరతలాంటి రైతు సమస్యలు, ప్రజల ఇతర ఇబ్బందులు, కూటమి పార్టీల హామీల అమలు లాంటి అంశాల్లో... వైసీపీ అటాకింగ్ మోడ్‌లోకి వెళ్తోంది.