Off The Record: సీఎం రేవంత్ సొంత పార్టీ నేతలకే సీరియస్ వార్నింగ్ ఇచ్చారా?
- గాంధీభవన్‌లో గొర్రెలతో గొల్ల కురుమల ధర్నా..
- ఆఫీస్ ముందు ధర్నాపై కాంగ్రెస్ పెద్దల సీరియస్..
- మంత్రి పదవి ఆశిస్తున్నవాళ్ళు చేయించి ఉంటారన్న డౌట్..
- వత్తిడి వల్లే మాదిగలకు మంత్రి పదవి దక్కిందన్న అంచనాలు..
- మిగతా సామాజికవర్గాలు ఆదర్శంగా తీసుకున్నాయా?..
- మలి విస్తరణలో పదవి కోసం వత్తిడి పెంచుతున్నారా?..
- పార్టీ ఆఫీస్ ముందు ధర్నాను సీరియస్‌గా తీసుకున్న సీఎం..
- పదవుల్లో యాదవులకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న ఫీలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ గాంధీభవన్‌లోకి ఏకంగా గొర్రెల్ని తోలుకొచ్చి ధర్నా చేశారు గొల్ల కురుమలు. గంటకు పైగా గాంధీ భవన్‌లో నానా హంగామా జరిగింది. గొల్ల కురుమల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆందోళకారులు. సమస్యలు చెప్పుకోవడం… వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేయడం వరకు ఓకేగానీ…. ఇలా ఏకంగా పార్టీ ఆఫీస్‌లోకి గొర్రెల్ని తీసుకు రావడం… అదీ సొంత పార్టీ నేతలే కావడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట పార్టీ పెద్దలు. మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళు ఎవరో వెనకుండి ఈ తంతు నడిపించి ఉంటారన్న అనుమానాలు పార్టీ నేతల్లో బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజికవర్గానికి అనవకాశం దక్కిన విధానాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారట.
Read Also: Off The Record: ఆ టీడీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు వేటు వేయనున్నారా..?
Also Read
కేబినెట్ బెర్త్ కోసం… హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా… వివిధ వర్గాల పెద్దల్ని కలిసి వత్తిడి పెంచడం వల్లే… మాదిగలకు అవకాశం దక్కిందన్న అభిప్రాయంతో ఉన్నారట మిగతా సామాజికవర్గాల నాయకులు. అందుకే మలి విస్తరణలో ఛాన్స్ కోసం ఇప్పటి నుంచే వత్తిడి పెంచే ప్లాన్‌లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే… పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, అధిష్టానం పెద్దల్ని కలిసి మంత్రి పదవి కోరటం, ఇతరత్రా పదవుల్ని ఆశించడంలో తప్పులేదుగానీ… సొంత పార్టీ కార్యాలయం ముందే ధర్నాలు చేయించడం క్రమశిక్షణ రాహిత్యమేగాక…. పూర్తి బాధ్యతారాహిత్యమని భావిస్తున్నారట సీఎం రేవంత్‌రెడ్డి. ఆ క్రమంలోనే…. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో గొల్ల కురుమల ధర్నా వ్యవహారంపై సీరియస్ అయినట్టు సమాచారం. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామంటూ కటువుగానే తేల్చి చెప్పారాయన.
Read Also: SBI PO 2025: బ్యాంక్ జాబ్ కావాలా?.. ఎస్బీఐలో 541 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు రెడీ.. మీరూ ట్రై చేయండి
ఇటీవల కార్పొరేషన్ పదవులు, పార్టీ కమిటీలు వేసినందున… అందులో యాదవులకు పూర్తిస్థాయి ప్రాధాన్యత ఇవ్వలేదని ఫీలింగ్‌లో ఉన్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు. వాళ్ళంతా… ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవడం, నాయకుల దగ్గర యాదవులకు గుర్తింపు లేదా అని మాట్లాడటం లాంటి అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని సీఎం మాట్లాడినట్టు తెలుస్తోంది. గాంధీభవన్ ఘటన వెనక సొంత పార్టీ నాయకులు ఉన్నారన్న అనుమానాలు బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. పదవులు ఆశిస్తున్న నాయకుల్లో ఎవరో ఒకరు అలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారట. కారణం ఏదైనా జరుగుతున్న పరిణామాలపై మాత్రం సీఎం కాస్త సీరియస్‌గానే ఉన్నట్టు సమాచారం. పదవులు ఆశించడం, తమ సామాజిక వర్గానికి న్యాయం జరగాలని కోరుకోవడంలో తప్పులేదు కానీ… పార్టీ కార్యాలయాల ముందు ధర్నాలు చేయించడమంటే… సొంత, అధికార పార్టీని అవమానించినట్టే కదా అన్నది కాంగ్రెస్ పెద్దల భావన అట. తాజా హెచ్చరిక ద్వారా అలాంటి వాళ్ల మీద తానో కన్నేసి ఉంచానన్న సంకేతం కూడా ముఖ్యమంత్రి పంపి ఉండవచ్చని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!