హ్యాపీ బర్త్ డే.. ఎవర్ గ్రీన్ ‘డార్లింగ్’ ప్రభాస్! రెబల్ ఫ్యాన్స్‌కు దీపావళితో పాటు వచ్చే మరో పెద్ద పండుగ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ప్రతీ ఏడాది అక్టోబర్ 23న ఆయన జన్మదినాన్ని అభిమానులు, సినీ ప్రేమికులు ఘనంగా జరుపుకుంటారు. ప్రభాస్ బర్త్ డే ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, ఇది ఒక పాన్ ఇండియా స్థాయిలో గుర్తించదగిన వేడుకగా మారింది. దేశం నలుమూలలనే కాకుండా ఓవర్సీస్‌లో యూఎస్, యూకే, జపాన్ వంటి…
ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు శుక్రవారం తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గినపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ యాక్సిడెంట్ సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. కడిపిలంక నుంచి పూలు కొనుగోలు చేసి, అనకాపల్లికి చెందిన ఇద్దరు మహిళలు స్వగ్రామానికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బొలెరో…
తెలంగాణ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ గాంధీభవన్‌లోకి ఏకంగా గొర్రెల్ని తోలుకొచ్చి ధర్నా చేశారు గొల్ల కురుమలు. గంటకు పైగా గాంధీ భవన్‌లో నానా హంగామా జరిగింది. గొల్ల కురుమల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆందోళకారులు. సమస్యలు చెప్పుకోవడం... వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేయడం వరకు ఓకేగానీ.... ఇలా ఏకంగా పార్టీ ఆఫీస్‌లోకి గొర్రెల్ని తీసుకు రావడం...
కాంగ్రెస్ చట్టాలు రైతులకు మేలు చేస్తే.. బీఆర్ఎస్ చట్టాలు ప్రజలకు ఇక్కట్లను తెచ్చాయి తెలంగాణ ఆవిర్భావం జూన్ 02 రోజున భూ భారతి చట్టం అమల్లోకి వచ్చింది. భూ సమస్యలను లేకుండా చేసేందుకు రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భూ భారతి చట్టం చరిత్రాత్మకం అని అన్నారు.…
కుటుంబ గొడవల కారణంగా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం హైదరాబాద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం, సైదాబాద్ డివిజన్ ఆస్మాన్‌ఘడ్ ఎస్టీ బస్తీకి చెందిన జాతావత్ కిరణ్ (36) ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న అతను…
విజయవాడలో మెగా వికసిత్ జాబ్ మేళా విజయవాడ నగరంలో మెగా వికసిత్ జాబ్ మేళా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, ఇతర టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో 60 ప్రముఖ కంపెనీలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు అందించాయి. జాబ్ మేళా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, మన రాష్ట్రం కొన్ని కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ,…
ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీ కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ విధి విధానాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 4 గంటల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర 7వేల పై చిలుకు కోట్ల అప్పు కోసం కేబినెట్ అనుమతిపై చర్చించారు
ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం 26వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ఈ నెల 26న సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని తెలిపారు.