బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలనుకుంటున్నారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 541 పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిలో 500 పోస్టులు రెగ్యులర్ పోస్టులకు. 41 పోస్టులు బ్యాక్‌లాగ్ పోస్టులకు కేటాయించారు.
Also Read:CM Chandrababu: ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీఆర్ సీఎం అయ్యారు..
SBI PO పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు నిర్దేశించిన కటాఫ్ తేదీ ప్రకారం 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ నుంచి వచ్చే అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఇవ్వబడుతుంది.
Also Read:Physical Harassment Case: క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు.. కోచ్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్
జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 750 చెల్లించాలి. SC/ST, PH కేటగిరీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష (లక్ష్యం + వివరణాత్మక), సైకోమెట్రిక్ పరీక్ష + గ్రూప్ డిస్కషన్ + ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 జీతం చెల్లిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జులై 14 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.