ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Cricket World Cup 2027: 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుతంగా రాణించినప్పటికీ ఫైనల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే 2027 ప్రపంచకప్‌లో ఆ లోటును పూడ్చుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లీ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ల ప్రాధాన్యాన్ని జాంటీ రోడ్స్ వివరించారు. ప్రపంచకప్ వంటి అత్యున్నత స్థాయి టోర్నమెంట్లో కేవలం ప్రతిభ, మంచి ఫామ్ ఉంటే సరిపోదని రోడ్స్ అన్నారు. తీవ్రమైన ఒత్తిడిని తట్టుకునే మానసిక బలం కూడా ఆటగాళ్లకు అవసరమని పేర్కొన్నారు. తాను నాలుగు ప్రపంచకప్‌లలో ఆడిన అనుభవంతో, ఆ టోర్నమెంట్లలో ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉంటుందో తనకు తెలుసని చెప్పారు. ఆటగాళ్లు శారీరకంగా ఫిట్‌గా ఉన్నప్పటికీ మానసిక దృఢత్వం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
రోహిత్ శర్మ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉండటం టీమ్ఇండియాకు అదనపు బలాన్ని ఇస్తుందని రోడ్స్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో విరాట్ కోహ్లీని నిజమైన మ్యాచ్ విన్నర్‌గా ప్రశంసించారు. ఆస్ట్రేలియా ఆటగాళ్ల మాదిరిగానే కోహ్లీకి కూడా మ్యాచ్‌లను గెలిపించాలనే తపన ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా ఛేజింగ్‌లో కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరని పేర్కొన్నారు. మైదానంలో పోటీ పడటాన్ని కోహ్లీ ఎంతగానో ఇష్టపడతారని, అతని దూకుడు వైఖరే అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతుందని జాంటీ రోడ్స్ అన్నారు. ప్రపంచకప్ వంటి పెద్ద వేదికపై ఇలాంటి మానసిక లక్షణాలు జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు.
Also Read
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ఇక యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంపైనా రోడ్స్ కీలక సూచనలు చేశారు. కెప్టెన్ అంటే ప్రతిదీ ఒంటరిగా చేయడం కాదని అన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్ల నుంచి సలహాలు తీసుకునే స్వేచ్ఛ గిల్‌కు ఉండాలని సూచించారు. అయితే, చివరి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం కెప్టెన్‌పైనే ఉంటుందని, అదే నాయకత్వంలో అత్యంత కష్టమైన అంశమని పేర్కొన్నారు. అయితే, 2027 వన్డే ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అక్కడి పరిస్థితులు భారత జట్టుకు అనుకూలంగా ఉండే అవకాశముందని రోడ్స్ తెలిపారు. దక్షిణాఫ్రికా పిచ్‌లు ప్రస్తుతం బ్యాటింగ్‌కు బాగా సహకరిస్తున్నాయని, బంతి బ్యాట్‌పైకి చక్కగా వస్తుందని చెప్పారు.
భారత బ్యాటర్లు ప్రస్తుతం స్కూప్, ర్యాంప్ వంటి ఆధునిక షాట్లను సమర్థంగా ఆడుతున్నారని, ఈ తరహా బ్యాటింగ్ దక్షిణాఫ్రికా పిచ్‌లపై టీమ్ఇండియాకు గణనీయమైన ప్రయోజనం కలిగించవచ్చని జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డారు. మొత్తంగా రోహిత్ అనుభవం, కోహ్లీ విజయం కోసం చూపించే తపన, గిల్ నాయకత్వం, భారత బ్యాటర్ల ఆధునిక ఆటతీరు.. 2027 ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు కీలక అంశాలుగా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!