OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
- హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ సీటు కోసం పోటాపోటీ
- తెరపైకి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేరు
- నేను పోటీలో లేనని అంటున్న రామచందర్‌రావు
- ఆయనైతే అలా కలిసొస్తుందంటూ ఇంటర్నల్‌గా లెక్కలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరులోకి ఊహించని వ్యక్తులు దిగబోతున్నారా? పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిన సామెతగా బీజేపీ నిర్ణయం తీసుకోబోతోందా? ఆశావహుల సంఖ్య పెరిగిపోతున్న టైంలో…. వాళ్ళందరికీ ఝలక్ ఇచ్చేలా అధిష్టానం నిర్ణయం ఉంటుందా? ఇంతకీ… ఎవరా ఊహించని వ్యక్తి? ఆయన గురించి పార్టీ పెద్దలు ప్రత్యేకంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి ఈ నెలలోనే ఓటర్ నమోదు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రధాన పార్టీల్లో ఆశావహులు సీటు కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎవరికి వారు ముందే ఖర్చీఫ్ వేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో… హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుండి బీజేపీ తరపున పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలోనే ఆశపడుతున్నారట. అలాంటి వాళ్ళంతా పెద్దల్ని కలిసి తమ మనసులో మాట చెప్పుకుంటుూ లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే… ఆ ప్రయత్నాలు ఎలా ఉన్నా… గతంలో ఇక్కడ నుండి పోటీ చేసి గెలిచిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావునే మరోసారి బరిలో నిలిపితే ఎలా ఉంటుందన్న చర్చ నడుస్తున్నట్టు తెలుస్తోంది. నేను పోటీలో లేను, నాకు పోటీ చేసే ఉద్దేశ్యం లేదని ఆయన అంటున్నా…రేస్ ఉంటారన్న ప్రచారం మాత్రం ఆగడం లేదట. దీని గురించి ఇంటర్నల్ గా గట్టి చర్చలే జరుగుతున్నాయని అంటున్నారు. ఇదే సీటు నుంచి అంతకు ముందు ఆయన గెలిచి ఉండడం, గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోవడం…గుడ్ విల్ లాంటివన్నీ కలిసి వస్తాయన్న లెక్కలేస్తున్నట్టు తెలిసింది. పార్టీ టిక్కెట్ కోసం ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్న క్రమంలో…వాళ్ళకు చెక్ పెట్టేందుకు రామచందర్‌రావునే రంగంలోకి దించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న మాటలు పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులుగా చట్ట సభల ప్రతినిధులే ఉన్నారు… ఈ యాంగిల్లో చూసుకుంటే రామ చందర్ రావుకు అడ్డంకి ఉండకపోవచ్చని అంటున్నారు. అటు అధికార పార్టీ నేతల మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుడు రామచందర్ రావు పోటీ చేస్తారా లేదా అని సీఎం ఆరా తీసినట్టు చెప్పుకుంటున్నారు. ఆయన పోటీ చేస్తే ఫైట్ టఫ్ ఉంటుందని, లేకుంటే మనం ఈజీగా గెలుస్తామని సీఎం అన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ హై కమాండ్ ఎలా ఆలోచిస్తోంది? స్టేట్ ప్రెసిడెంట్‌నే ఎంపిక చేస్తే మిగతా వాళ్ళ రియాక్షన్ ఏంటన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.
Also Read
తాజావార్తలు
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
-
CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!