Off The Record: పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్‌ఎస్ వ్యూహం మారుతోందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ పార్టీ వ్యవహారాలకైనా పార్లమెంటు సమావేశాలు చాలా కీలకం. అధికార పార్టీపై విపక్షాలు ఎటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాయి? ఏ అంశాల్లో అధికారపార్టీని ఇరుకున పెడుతున్నాయో తెలిసిపోతుంది. కొన్ని అంశాలపై అజెండాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీలు కలిసి నడుస్తాయి. దేశంలో గుణాత్మక మార్పులు రావాలి.. అది భారత రాష్ట్ర సమితితోనే సాధ్యమని చెబుతున్నారు గులాబీ నేతలు. అందుకే బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలను కలుపుకొని వెళ్లేందుకు చూస్తున్నారు కూడా. ఈ వ్యూహంలో భాగంగా పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీలు వేస్తున్న అడుగులు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి.
Read Also: Off The Record: పవన్‌ను బీజేపీ నమ్మడం లేదా? అనుమానం వచ్చిందా?
Also Read
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఏ రోజు కా రోజు కొత్త స్ట్రాటజీ అమలు చేస్తోంది బీఆర్‌ఎస్. తొలిరోజు ఆమ్ ఆద్మీపార్టీ ఎంపీలతో కలిసి రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు గులాబీ ఎంపీలు. ఇటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నారు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే. కేంద్రాన్ని నిలదీసేందుకు కలిసొచ్చే పార్టీలతో ఖర్గే సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఆ విధంగా కాంగ్రెస్ నిర్వహించిన తొలి భేటీకి ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్లింది. కాంగ్రెస్ నిర్వహించిన మరో సమావేశంలో బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కనిపించారు. దీంతో రాజకీయ వర్గాల్లో అటెన్షన్ వచ్చింది. ఎందుకంటే.. గత పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంది గులాబీ పార్టీ. ప్రత్యామ్నాయ అజెండాను బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్.. కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉండాలని చూస్తోంది. పార్లమెంట్ సమావేశాల బ్యాక్‌డ్రాప్‌లో కాంగ్రెస్ నిర్వహించిన సమావేశానికి గులాబీ ఎంపీలు వెళ్లడంతో చర్చగా మారింది. ఖమ్మం సభకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ రావడంతో.. పార్లమెంట్‌లో ఆప్‌తో కలిసి బీఆర్‌ఎస్ ఎంపీలు కలిసి సాగినా పెద్దగా చర్చ లేదు. కానీ.. కాంగ్రెస్ మీటింగ్‌కు వెళ్లడంతో గులాబీ పార్టీ ఉభయ సభల్లో ఏ రోజు కా రోజు స్ట్రాటజీ అమలు చేస్తోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే మరికొందరు మాత్రం.. ఈ కలయిక.. పార్లమెంట్ సమావేశాల వరకే పనిచేస్తుందా లేక బయట కూడా కలిసి అడుగులు వేస్తారా అని ఆరా తీస్తున్నాయట.
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!