Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో బీజేపీ వ్యూహం ఎలా ఉంది? ఏపీలో పొత్తులున్నా... తెలంగాణలో మాత్రం మేం సింగిల్ అంటున్న కమల నేతలు... జూబ్లీహిల్స్‌లో కూడా అదే స్టాండ్ తీసుకుంటారా? అక్కడ బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? అసలు తెలంగాణలో టీడీపీని ఎందుకు వద్దనుకుంటోంది కాషాయ పార్టీ? లెక్కల్లో ఎక్కడ తేడా కొడుతోంది?
Beerla Ilaiah: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపుతూ ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై బీఆర్‌ఎస్, బీజేపీ మైత్రి మరోసారి బయటపడిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకే బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగిందని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి “అవయవ దానం” చేసిందని వ్యాఖ్యానించారు. తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు లాంటి బలహీన వ్యక్తిని నియమించడం…
ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో నాలుగో రోజు బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం జరుగుతోంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడంతో పాటు, రాబోయే సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 27న వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఇప్పటికే పార్టీ నేతలకు సూచనలు అందించారు. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు అసెంబ్లీకి రానున్నారు. 9:30 నిమిషాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని సూచించారు. ప్రతిరోజూ అసెంబ్లీకి తప్పకుండా హాజరుకావాలని సూచించారు. అరగంట ముందుగా 9:30 కే అసెంబ్లీకి రావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఎల్పీలో సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. సమావేశాల్లో మాట్లాడే అంశాలపై పూర్తిగా అధ్యయనం చేసి మాట్లాడాలని సూచించారు.
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, మంత్రుల సమావేశం జరిగింది.
ఏ పార్టీ వ్యవహారాలకైనా పార్లమెంటు సమావేశాలు చాలా కీలకం. అధికార పార్టీపై విపక్షాలు ఎటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాయి? ఏ అంశాల్లో అధికారపార్టీని ఇరుకున పెడుతున్నాయో తెలిసిపోతుంది. కొన్ని అంశాలపై అజెండాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీలు కలిసి నడుస్తాయి. దేశంలో గుణాత్మక మార్పులు రావాలి.. అది భారత రాష్ట్ర సమితితోనే సాధ్యమని చెబుతున్నారు గులాబీ నేతలు. అందుకే బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలను కలుపుకొని వెళ్లేందుకు చూస్తున్నారు కూడా. ఈ వ్యూహంలో భాగంగా పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీలు…